తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్, వార్డు సభ్యులను గెలిపించాలని కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి అన్నారు. ఆదివారం చుంచుపల్లి మండలం ప్రశాంతినగర్, రుద్రoపూర్ గ్రామపంచాయతీల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం ముమ్మర ప్రచారం చేపట్టారు. ప్రశాంతినగర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు, రుద్రంపూర్ సర్పంచ్ అభ్యర్థి గుమ్మడి దివ్య గెలుపు కోసం ఓటర్లను అభ్యర్థించారు. తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ప్రశాంతినగర్ సర్పంచ్ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు సీరియల్ నెం.1 ఉంగరం గుర్తుపై ఓటు వేయాలని కోరారు. రుద్రంపూర్ సర్పంచ్ అభ్యర్థి గుమ్మడి దివ్య నెం.3 కత్తెర గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ