తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఇద్దరు యువకుల వద్ద గంజాయి లభించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్కు చెందిన శ్రావణ్కుమార్, పవన్ స్నేహితులు. సీలేరు నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న వీరిని టేకులపల్లి మండలంలోని వెంకట్యాతండా వద్ద పోలీసులు తనిఖీ చేయగా 800 గ్రాముల గంజాయి దొరికింది. వారిద్దరికి గంజాయి అలవాటు ఉందని విచారణలో తేలింది. యువకులను అరెస్టు చేసి వాహనాన్ని సీజ్ చేసినట్లు ఎస్సై తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ