Thursday, 14 May 2026 01:03:26 AM
# అశ్వారావుపేటకు హార్టికల్చర్ కళాశాల తీసుకొచ్చిన ఎమ్మెల్యే జారె. # అన్నపురెడ్డిపల్లి చెరువు వద్ద పేకాట శిబిరంపై పోలీసుల దాడిలో నలుగురు అరెస్ట్. # బి ఆర్ ఎస్ కమిటి ఆధ్వర్యంలో ఆందోళన చేసిన మండల ఉపాధ్యక్షులు మద్దిరాల చిన్న పిచ్చయ్య. # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే జారె. # సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించిన టేకులపల్లి ఎస్సై జుబేదా బేగం. # కలెక్టర్ చేతుల మీదుగా బ్యాటరీ వీల్ చైర్ పంపిణీ. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లాలో లాడ్జిలను నడిపించే యాజమాన్యాలు నిబంధనలను కచ్చితంగా పాటించాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # ఎన్సీసీ క్యాడెట్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ట్రాఫిక్ పోలీసులు. # కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం వల్ల అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుంది. ఎమ్మెల్యే జారె. # అశ్వారావుపేట నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే జారె. # జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పర్సనల్ మేనేజర్ తిరుపతి నీ సన్మానించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. # పుల్లాయిగూడెం శ్రీసీతారామాంజనేయస్వామి ఆలయ పూజలో పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు . # రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం గుండుగులపల్లి కార్యక్రమంలో వివరించిన ఎమ్మెల్యే జారె. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # విపత్తుల నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్‌లకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ఆసుపత్రులు,డయాగ్నస్టిక్ సెంటర్లకు అనుమతులు తప్పనిసరి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : జిల్లా కలెక్టర్ అంకిత్. # తమిళనాడు గవర్నర్ వ్యవహారం హాస్యాస్పదం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

చదువు జీవితాన్ని వెలిగించే దీపం

Date : 08 June 2025 08:47 PM Views : 581

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : చదువు జీవితాన్ని వెలిగించే దీపం - గ్రంథాలయాలు ప్రత్యక్ష దేవాలయాలు - విశ్రాంత ఉద్యోగుల ప్రోత్సాహం మరువలేనిది - డి.ఎస్.పి అబ్దుల్లారెహమాన్ కొత్తగూడెం పట్టణంలో గల జిల్లా గ్రంధాలయం నందు సీనియర్ సిటిజన్స్ విద్యానగర్ కాలనీ వారి ఆధ్వర్యంలో పదివేల రూపాయలు విలువ చేసే సాధారణ వేడి , చల్లని , త్రాగునీరు అందించే వాటర్ కూలర్ ను జిల్లా గ్రంథాలయానికి డి.ఎస్.పి ఆర్ఎస్ రెహమాన్ ఆధ్వర్యంలో అందజేశారు . ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ చదువు జీవితాలనివెలిగించే చక్కటి దీపం అని, సామాన్య కుటుంబాన్ని సంపన్న కుటుంబం గా తీర్చిదిద్దుతుందని ఆయన అంటూ కష్టపడి, ఇబ్బందులను ఓర్చుకుని మంచిగా చదువుకున్న వారు నేడు ఉన్నత స్థానాల్లో నిలిచారని చెప్పారు. నేటి రోజుల్లో చదువుకునేందుకు ప్రభుత్వాలు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నాయని, కనీస మౌలిక సదుపాయాలు లేని రోజుల్లో వీధి దీపాలు కిరోసిన్ లాంతర్ల ముందు కూర్చుని చదువులు సాగించారని చెప్పుకొచ్చారు. విద్యార్థులు ఓ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని చదివిన నాడు లక్ష్యం సహకారం అవుతుంది, కృషి పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదన్నారు. గ్రంథాలయాలు ప్రత్యక్ష దేవాలయాలు వంటివనీ, వాటిని సద్వినియోగం చేసుకొని మంచి వాతావరణంలో చదువుకోవాలని సూచించారు. గ్రంథాలయాలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు సదుపాయాలు కల్పిస్తుందని మెరుగైన సమాజాన్ని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు. విశ్రాంత ఉద్యోగులు తమకు వచ్చే నెలవారి పింఛన్లులో మంచి సమాజాన్ని ఏర్పాటు చేసేందుకు గ్రంథాలయాల్లో ఉన్న అవసరాలను గుర్తించి వాటిని సమకూర్చేందుకు ముందుకు రావడం గర్వకారణం అన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి బ్రతుకులను బంగారు మయంగా మలుచుకోవాలని, మన ప్రవర్తన ఆధారంగానే జీవితాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రంథ పాలకురాలు జి మణి మృదుల సీనియర్ సిటిజెన్ సభ్యులు ప్రెసిడెంట్ కోట్ల నాగేశ్వరరావు, సెక్రటరీ సురేష్ కుమార్ ట్రెజరర్ ధర్మరాజు, కేశవరావు విద్యార్థిని విద్యార్థులు పాఠకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :