తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక పరిధిలోగల గాంధీనగర్ చెందిన కొత్తూరు ఆదిలక్ష్మి బావిలో పడి మృతి చెందింది. కుటుంబీకుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొత్తూరు యాదగిరి కూతురు ఉదయం బావిలో నీళ్ళు తోడుతుండగా మూర్ఛ రావడంతో ప్రమాదవశాత్తు బావిలో పడి చనిపోయిందని తెలిపారు. చిన్నతనం నుంచి మూర్ఛ వ్యాధి బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ఆసుపత్రికి తరలించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ