Friday, 18 September 2026 04:20:23 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం జూలూరుపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా

Date : 18 October 2024 05:59 PM Views : 705

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం జూలూరుపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా మెమోరాండం ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బానోతు ధర్మ మాట్లాడుతూ రైతులు వేసిన పంట చేతికొచ్చే తరుణంలో మార్కెట్లో దళారులచే దోపిడీకి గురవుతున్న తరుణంలో ప్రభుత్వాలు రైతుల పట్ల అనుసరిస్తున్న తీరును చూస్తే రైతు తెచ్చిన అప్పు కూడా తీర్చలేని పరిస్థితిలో ఉన్నదని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు రైతు వేసిన పంటకు అయిన పెట్టుబడికి లెక్క గట్టి ప్రభుత్వం తగు పంటకు గిట్టుబాటు ధర కల్పించాల్సిందిగా ఆ దిశలో ప్రభుత్వాలు లేవని వారు అన్నారు స్వామినాథ కమిషన్ సిఫార్సు ప్రకారంగా ప్రభుత్వాలు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే 50% లెక్క గట్టి రైతుల పంటకు మద్దతు ధర కల్పించే అవకాశం ఉందని వారు గుర్తు చేశారు పత్తి పంట విక్రయించేందుకు మార్కెట్కు వెళ్ళితే సరైన ధర పలకటం లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల అనుసరిస్తున్న తీరు చూస్తే రైతుల నట్టెడ ముంచే పద్ధతులను అనుసరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పంట చేతికొచ్చి మార్కెట్ కు వెళితే దళారులచే మోసపోతున్నారని దోపిడికి గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు దళారుల వ్యవస్థను అరికట్టే దాంట్లో ప్రభుత్వాలు విఫలం చెందుతున్నాయని వారు గుర్తు చేశారు పత్తి పంట కింటాకు 10000 రూపాయలు ఇవ్వాలని వారు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు మొక్కజొన్నకు కింటాకు 3500 ఇవ్వాలని అన్న రూ . జూలూరుపాడు మండలంలో ఉప మార్కెట్.గా ఉన్న మార్కెట్ యార్డును ఏనుకూరు మండలం నుండి విడదీసి జూలూరుపాడు మండల శ్వాస త మార్కెట్ యార్డును తక్షణమే ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు పై డిమాండ్లు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో అన్ని వర్గాల రైతులతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు దేశానికి రైతే రాజు రైతు లేనిది రాజ్యం లేదని పాలకులు ఎన్నో వాగ్దానాలు చేస్తున్న అవి ఆచరణలో అమలుకు నోచుకోవట్లేదని రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సవత తల్లి ప్రేమను చూపిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు రైతులకు అనేక సబ్సిడీలు అనేక సంక్షేమ పథకాలు వర్తింప చేసే దాంట్లో ప్రభుత్వాలు విఫలం చెందని వారు అన్నారు .ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి ఎదలపురం. గోపాలరావు రైతు సంఘం జిల్లా నాయకులు రైతు సంఘం జిల్లా నాయకులు లింగాల. వీరభద్రం మండల నాయకులు రాయల.సీదు ఎం. కృష్ణయ్య పైద .వెంకటేశ్వర్లు ఇరప.రాజు వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ అధ్యక్షులు వెంకటమ్మ, గోపమ్మ, మండల నాయకులు సోడెం. నరసింహారావు, కృష్ణ, కల్తీ. శేఖర్, తాటి.నరసింహారావు తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :