Friday, 18 September 2026 03:15:34 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

రాత్రి సమయంలో కూడా మొక్కజొన్న అన్‌లోడింగ్ కొనసాగేలా చర్యలు చేపట్టాలి..

Date : 26 May 2026 05:58 PM Views : 130

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలి - జిల్లా కలెక్టర్ అంకిత్ లక్ష్మీదేవిపల్లి మండలంలోని బంగారు చిలక మొక్కజొన్న నిల్వ గోడౌన్‌తో పాటు ఇల్లందు క్రాస్ రోడ్ వద్ద నిర్మాణంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులను మంగళవారం జిల్లా కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. బంగారు చిలక మొక్కజొన్న గోడౌన్‌ను పరిశీలించిన కలెక్టర్, గోడౌన్‌కు చేరుతున్న మొక్కజొన్న లారీల అన్‌లోడింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గోడౌన్‌లో 2,500 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం ఉందని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. సుజాతనగర్, కొత్తగూడెం, టేకులపల్లి, ఇల్లందు, చర్ల, సమ్మెట, బూర్గంపాడు, ఆళ్లపల్లి, గుండాల తదితర మండలాల నుంచి మొక్కజొన్న ఇక్కడికి వస్తోందని తెలిపారు. అన్‌లోడింగ్ ప్రక్రియ ఆలస్యం కాకుండా రాత్రివేళల్లో కూడా పనులు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఇందుకోసం తగిన లైటింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, అవసరమైతే అదనపు హమాలీలను నియమించాలని సూచించారు. గోడౌన్‌లో మొక్కజొన్న నిల్వల అన్‌లోడింగ్ తీరును, బస్తాలను భద్రపరుస్తున్న విధానాన్ని పరిశీలించిన కలెక్టర్, పూర్తి నిల్వ సామర్థ్యాన్ని వినియోగించుకునేలా పంటను నిల్వ చేయాలని, ఎలాంటి నష్టం కలుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిల్వ సామర్థ్యాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకునేలా మొక్కజొన్న బస్తాలను సాధ్యమైనంత ఎక్కువ ఎత్తులో పేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. హమాలీలతో మాట్లాడిన కలెక్టర్, ఒక్క లారీ అన్‌లోడింగ్‌కు ఎంత సమయం పడుతోంది, ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. హమాలీలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, తాగునీటి సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఇల్లందు క్రాస్ రోడ్ వద్ద నిర్మాణంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. భవన నిర్మాణ పనుల పురోగతి, నాణ్యత, పూర్తి స్థితిపై సంబంధిత శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత సంవత్సరం మే నెలలో ప్రారంభమైన పనులు ఇప్పటివరకు పూర్తికాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్, పనుల ఆలస్యానికి గల కారణాలను వివరంగా నివేదించాలని ఆదేశించారు. పనుల అమలులో జాప్యం చోటుచేసుకున్న కాంట్రాక్టర్లకు మెమోలు జారీ చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్ల వ్యయంతో మహిళా సాధికారతకు వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణంలో నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని కలెక్టర్ స్పష్టం చేశారు. నిర్ణీత గడువులోగా నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ ప్లాన్లు, గదుల నిర్మాణం, మౌలిక సదుపాయాల పనులను పరిశీలించిన కలెక్టర్, పనులు ఎప్పటిలోగా పూర్తి అవుతాయో అధికారులను ఆరాతీశారు. పనుల పురోగతిని ప్రతిరోజూ పర్యవేక్షించాలని, నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు అవసరమైన సంఖ్యలో కార్మికులను నియమించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భవనంలోని ప్రతి బ్లాక్‌ను అన్ని సౌకర్యాలతో సిద్ధం చేయాలని, స్వయం సహాయక సంఘాల మహిళలకు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, ఉత్పత్తుల ప్రదర్శన, మార్కెటింగ్ కార్యకలాపాలకు ఉపయోగపడే విధంగా భవనాన్ని తీర్చిదిద్దాలని సూచించారు. ఈ పరిశీలనలో తాసిల్దార్ శిరీష, పంచాయతీరాజ్ అధికారి శ్రీనివాస్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :