Thursday, 05 November 2026 11:59:53 PM
# ఎమ్మెల్సీ ఓటరు దరఖాస్తుల పరిశీలన 15 రోజుల్లో పూర్తి చేయాలి: సీఈవో సుదర్శన్ రెడ్డి. # స్మశానవాటికల పరిశుభ్రతకు మేయర్ గణేష్ ఆదేశం. # గ్రాడ్యుయేట్ల ఓటు నమోదు ముమ్మరం చేయాలి: సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # మురుసు తుఫాన్‌ బాధిత రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి: సీపీఐ డిమాండ్. # భద్రాద్రి కొత్తగూడెంలో ఐఎఫ్‌ఎంఐఎస్ జిల్లా స్థాయి శిక్షణ విజయవంతం. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిరుద్యోగులకు సువర్ణావకాశం: భారత్ హ్యుందాయ్‌లో ఉద్యోగాల భర్తీకి శనివారం ఇంటర్వ్యూలు! # శాశ్వత పనులతో జిల్లాను మోడల్‌గా నిలపాలి: మంత్రి తుమ్మల. # తుపాను నష్టంపై మంత్రి పొంగులేటి ఉన్నతస్థాయి సమీక్ష. # తుఫాను నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలి: సీపీఐ డిమాండ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా . # బేతుపల్లి చెరువు వరదల్లో చిక్కుకున్న 19 మంది సురక్షితం. # సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి యువజనోత్సవాల ఎంపిక పోటీలు.క్రీడల అధికారి వి. అనూష. # సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐటీయూసీ డిమాండ్ # మురసు తుఫాను పంట నష్టం: రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. # లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యను నివారిస్తాం: మేయర్ మూడ్ గణేష్. # ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతిపై సీపీఐ దిగ్భ్రాంతి: రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. # పాములేరు వాగు వరద ఉధృతిని పరిశీలించిన ఎస్పీ రోహిత్ రాజు # కండక్టర్ ప్రవళిక మృతి బాధాకరం: కుటుంబానికి కోటి రూపాయల బీమా, ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.మంత్రి పొన్నం ప్రభాకర్. # మహిళా కండక్టర్ ప్రవళిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి # తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TDPS) విడుదల చేసిన తాజా వాతావరణ నివేదిక ప్రకారం ముఖ్యాంశాలు

అక్రిడిటేషన్ కార్డుల జారీకి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానం.. జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 07 February 2026 12:12 PM Views : 317

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ నెల 9 నుండి ఆన్లైన్ లో దరఖాస్తులు సమర్పించాలి. సమాచార పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో 2026–28 సంవత్సరానికి జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అక్రెడిటేషన్ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితి గడువు ఫిబ్రవరి 28తో ముగియనున్నందున అర్హత కలిగిన జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కార్డుల కోసం మీడియా యాజమాన్యాలు తమ జర్నలిస్టుల పేర్ల జాబితాను జిల్లా పౌరసంబంధాల అధికారి నకు సమర్పించాలన్నారు. యాజమాన్యాల ద్వారా పంపిన పేర్లలో ఉన్న జర్నలిస్టులు సమాచార పౌరసంబంధాల శాఖ అధికారిక వెబ్‌ సైట్ http://ipr.telangana.gov.in ద్వారా ఆన్‌ లైన్‌ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లా స్థాయిలలో ఆన్‌ లైన్ దరఖాస్తులను ఫిబ్రవరి 9 నుండి సమర్పించాలని, అర్హులైన జర్నలిస్టులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రకటనలో పేర్కొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :