తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 31 రోజున విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డీజేలు,అధిక శబ్దం వచ్చే బాక్స్ లు వినియోగిస్తే ఉపేక్షించేది లేదు.. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారికి వాహనాలు ఇచ్చిన వారిపై కేసులు నమోదు : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రజలకు సూచించారు.నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న వేళ జిల్లా ప్రజలు ప్రశాంతమైన వాతవరణంలో వేడుకలను జరుపుకోవాలని సూచించారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ తరుపున పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. డిసెంబర్ 31 రోజున జిల్లా వ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ తనీఖీలు నిర్వహించబడుతాయని,నూతన సంవత్సర వేడుకల సందర్బంగా ఎర్పాటు చేసే ఎలాంటి కార్యక్రమాలు అయన సరే నిర్వహకులు తప్పనిసరిగా పోలీసు అధికారుల నుండి ముందస్తు అనుమతులు తీసుకోవాలని,అలాగే ప్రజలకు ఇబ్బందులకు గురిచేసే విధంగా నిబంధనలకు విరుద్ధంగా డిజేలు,అధిక శబ్దం వచ్చే బాక్స్ లు ఏర్పాటు చేస్తే ఉపేక్షించేది లేదని,తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. సైబర్ నేరగాళ్లు నూతన సంవత్సర శుభాకాంక్షల పేరుతో ఫోటోలు,మెసేజ్ లు పంపుతూ బ్యాంక్ అకౌంట్లలో ఉన్న నగదును కాజేయాలని కొత్త కొత్త దారులు ఎంచుకుంటున్నారు.కావునా తెలియని వ్యక్తుల వద్ద నుంచి మెసేజ్ లు వస్తే ఓపెన్ చేయొద్దని ఎస్పీ సూచించారు. పోలీసుల వారి సూచనలు, నిబంధనలు.... ???? డిసెంబర్ 31వ తేదీన టపాసులు, lమైకులు ఎక్కువ సౌండ్ పెట్టి ఎవరినీ ఇబ్బంది పెట్టకూడదు,అలా చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ???? డిసెంబర్ 31వ తేదీన జిల్లా వ్యాప్తంగా డీజే లు నిషేధం.నిబంధనలు విరుద్ధంగా వినియోగిస్తే సీజ్ చేసి,కేసులు నమోదు చేస్తాం. ???? మద్యం మత్తులో వాహనాలు నడపడం నేరం.వాహనాలు ఇష్టానుసారంగా వేగంగా నడిపితే కేసులు నమోదు చేయడంతోపాటు జైలు శిక్ష విధించబడుతుంది. ???? ప్రభుత్వ,ప్రవేట్ ఆస్తులపై,రాళ్లు వేయడం,అద్దాలను పగలగొట్టడం,మహిళలను ఇబ్బంది పెట్టినా,అసభ్యంగా ప్రవర్తించినా,అట్టి వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. ???? మైనర్ డ్రైవింగ్,ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసింగ్, త్రిబుల్ రైడింగ్, సైలెన్సర్ లను తీసివేసి వాహనాలు నడపడం, శబ్దకాలుష్యం చేస్తూ ఇతరులను ఇబ్బంది పెడితే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ???? న్యూ ఇయర్ వేడుకలలో నిషేదిత డ్రగ్స్,గంజాయి వంటి మత్తు పదార్థాలు విక్రయించినా,వినియోగించినా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ???? మద్యం దుకాణాలను నిర్ణీత సమయంలో మూసివేయాలి. మైనర్లకు మద్యం అమ్మకూడదు. ???? బహిరంగ ప్రదేశాల్లో, ప్రభుత్వ స్థలాల్లో మద్యం సేవిస్తే కేసులు నమోదు చేయడం జరుగుతుంది ???? మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారికి వాహనాలు ఇచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తామని, వారి వల్ల ఏదైనా ప్రమాదం చోటు చేసుకుంటే వారి సంరక్షకుల పైన కేసులు నమోదు చేస్తాం. పై అంక్షలను ఎవరైన అతిక్రమించినా,ఉల్లంఘించినట్లుగా ప్రజల దృష్టికి వస్తే వెంటనే డయల్ 100 కు సమాచారం అందించడం ద్వారా తక్షణమే స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతాయని,ఈ వేడుకలను ప్రజలు,యువత తమ ఇండ్లలోనే తమ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకరమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా 2026 సంవత్సరంలో ప్రజలందరికీ మంచి కలగాలని శిస్తూ,జిల్లా ప్రజలందరికీ పోలీస్ శాఖ తరపున ఎస్పీ రోహిత్ రాజు నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు
Admin
తెలుగు వెలుగు టీవీ