Sunday, 02 August 2026 02:33:42 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి : ఎన్నికల వ్యయ పరిశీలకురాలు లావణ్య

Date : 30 January 2026 05:47 PM Views : 156

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా, పారదర్శక వాతావరణంలో సజావుగా జరిగేలా అన్ని శాఖల అధికారులు పూర్తి బాధ్యతతో తమ విధులను నిర్వర్తించాలని మున్సిపల్ ఎన్నికల వ్యయ పరిశీలకురాలు లావణ్య సూచించారు. శుక్రవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ఏఈఓలు, తహసీల్దార్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ టీములు (ఎఫ్‌ఎస్‌టీ), స్టాటిక్ సర్వైలెన్స్ టీములు (ఎస్‌ఎస్‌టీ), వీడియో సర్వైలెన్స్ టీములు (వి‌ఎస్‌టీ), వీడియో వ్యూయింగ్ టీములు (వి‌వీటీ)లతో కలిసి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందనతో కలిసి ఎన్నికల వ్యయ పరిశీలకురాలు లావణ్య సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు జిల్లాలో ఫ్లయింగ్ స్క్వాడ్ టీములు – 8, స్టాటిక్ సర్వైలెన్స్ టీములు – 8, వీడియో సర్వైలెన్స్ మరియు వీడియో వ్యూయింగ్ టీములు, జీఎస్టీ అధికారులు – 8 మంది, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్లు (ఏఈఓలు) – 10 మందిని నియమించినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్‌ను కట్టుదిట్టంగా అమలు చేస్తూ, ఎక్కడైనా నిబంధనల ఉల్లంఘన జరిగితే తక్షణమే చర్యలు తీసుకునే విధంగా అన్ని బృందాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల వ్యయ పరిశీలకురాలు లావణ్య మాట్లాడుతూ, అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా కఠిన నియంత్రణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల సమయంలో అక్రమ నగదు, మద్యం, బహుమతులు తదితర ప్రలోభకర అంశాల పంపిణీని అడ్డుకునేందుకు ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాలు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు. అభ్యర్థుల ఎన్నికల ఖర్చులు, ప్రచార సామగ్రి, ర్యాలీలు, సభలు, పత్రికా ప్రకటనలు, సోషల్ మీడియా ప్రచారం వంటి అన్ని అంశాలపై సమగ్ర అవగాహనతో పర్యవేక్షణ జరగాలని ఆమె స్పష్టం చేశారు. ప్రతి అభ్యర్థి ఖర్చును ఖచ్చితంగా నమోదు చేసి, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఖర్చుల ఖాతాలను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికల విధుల్లో ఉన్న అన్ని బృందాలు ప్రతిరోజూ నిర్వహించిన తనిఖీలు, స్వాధీనాలు, నమోదైన కేసులు తదితర వివరాలతో కూడిన రోజువారీ నివేదికలను తప్పనిసరిగా సమర్పించాలని, చేపట్టిన ప్రతి చర్యను ఖచ్చితంగా నమోదు చేసి స్వాధీనాల వివరాలను అధికారిక రికార్డుల్లో పొందుపరచాలని ఎన్నికల వ్యయ పరిశీలకురాలు లావణ్య ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో ఎటువంటి చిన్న నిర్లక్ష్యం చోటు చేసుకోకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆమె సూచించారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, తహసీల్దార్లు, ఎన్నికల నిర్వహణకు నియమిత వివిధ బృందాల సభ్యులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :