తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : గురువారం అర్ధరాత్రి వేంసూరు మండలం వి. వెంకటాపురం గ్రామంలో గణేశ్ నిమజ్జన ఊరేగింపులో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. నిమజ్జనానికి వెళ్తుండగా ట్రాక్టర్ పైనుంచి కిందపడి షేక్ రషీద్ (20) అనే యువకుడు మృతి చెందాడు. ట్రాక్టర్ నడుపుతున్న స్నేహితుడికి డ్రైవింగ్ ఇచ్చి పక్కన కూర్చున్న రషీద్, ప్రమాదవశాత్తు కిందపడి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ