తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం డిసెంబర్ 30 తెలుగు వెలుగు ) : వైకుంఠ ఏకాదశి సందర్భంగా జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సీతారామచంద్ర స్వామి వారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. మండలంలో కాకర్ల గ్రామంలో పాలగుట్టపై రుక్మిణి సమేత సంతాన వేణుగోపాల స్వామి ఆలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతారం గ్రామం నందు అభయాంజనేయ స్వామి ఆలయంలో సీతారామచంద్ర స్వామి ఉత్సవ విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకాలు మరియు ఏక నామ సంకీర్తనలతో వైకుంఠ ఏకాదశిని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.మండల వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి ని వైష్ణవాలయాలలో ప్రత్యేక పూజలు జరిగాయి
Admin
తెలుగు వెలుగు టీవీ