Tuesday, 03 November 2026 04:15:11 AM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

అర్హత లేనప్పుడు సర్వే ఎందుకు? అధికారులారా !ప్రజలను మభ్య పెట్టకండి!

Date : 14 December 2024 06:26 PM Views : 1040

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం (మున్సిపాలిటీ) ఇందిరమ్మ గృహాల మంజూరులో రిజిస్ట్రేషన్ పట్టా నిబంధనను సడలించాలని ,లేకుంటే రామవరం ప్రజల ఆశలపై అధికారులే నీళ్ళు చల్లినట్లు అవుతుందని మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మునగడప వెంకటేశ్వర్లు అధికారుల తీరును తప్పుపట్టారు. శనివారం స్థానిక నేతాజీ బస్తి లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో గృహలక్ష్మి పథకం రామవరం ప్రాంతానికి వర్తించలేదని అప్పుడు కూడా ఇలాగే సర్వే చేసి రామవరం ప్రాంతం 1/70 చట్ట పరిధిలో ఉందని సింగరేణి యాజమాన్య పరిధిలో ఉందని అప్పుడు కూడా రామవరం ప్రాంత ప్రజల దరఖాస్తులను తిరస్కరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అలనాటి ముఖ్యమంత్రి కీర్తిశేషులు వై యస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో రామవరం ప్రాంతంలో సుమారు 18 వందల గృహాలు మంజూరు చేశారని, అప్పుడు లేని నిబంధన ఇప్పుడు అధికారులకు గుర్తొచ్చిందా! అని ప్రశ్నించారు ?ఇందిరమ్మ గృహాల సర్వే తో ప్రజల్లో సొంతగృహం స్వప్నం చిగురిస్తుంటే అధికారుల సర్వే నిబంధన మాత్రం వారి ఆశలపై నీళ్లు చల్లుతుందని ,సర్వేల పేరుతో ప్రజలను మభ్య పెట్టొద్దని ఆయన అధికారులను కోరారు. తక్షణమే రామవరం ప్రాంతానికి రిజిస్ట్రేషన్ పట్టా అనే నిబంధనను తొలగించి సాదా అగ్రిమెంట్ ను పరిగణలోకి తీసుకొని అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ గృహాలు మంజూరు చేయాలని ఉన్నత స్థాయి అధికారులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో నాయకులు తమ్మ సత్తి, రామ్ రాకేష్, కాటం రాజ్ గుమ్మడి శ్రీను, మార్తమ్మ ,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :