తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం జిల్లా బీసీ సంక్షేమాధికారిగా పి.విజయలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె కలెక్టర్ జితేష్ వి.పాటిల్ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఇప్పటివరకు ఈ విధులను నిర్వహించిన ఇందిర భూపాలపల్లికి బదిలీ అయ్యారు. గతంలో బీసీ అభివృద్ధి అధికారిగా పనిచేసిన విజయలక్ష్మి పదోన్నతి పొంది బీసీ సంక్షేమాధికారిగా నియమితులయ్యారు.
Admin
తెలుగు వెలుగు టీవీ