తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్ ఆదేశానుసారం అన్ని జిల్లా కేంద్రాల్లో, అన్ని మండల కేంద్రాలలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఈరోజు 31.05.2026 (ఆదివారం) ప్రారంభించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది.దినిలో భాగంగా ఈరోజు చండ్రుగొండ మండల కేంద్రంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద అశ్వారావుపేట నియోజకవర్గ సేవాదళ్ ప్రధాన కార్యదర్శి ఎం డి పజల్ బక్షి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు కేశబోయిన నరసింహారావు జెండా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమం చండ్రుగొండ మండలంలోఘనంగా నిర్వహించిన చండ్రుగొండ మండల సేవా దళ్ కమిటీ సభ్యులు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బి- బ్లాక్ అద్యక్షులు చాపల మడుగు లక్ష్మణరావు,మండల సేవా దళ్ అధ్యక్షులు బుంగ శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నల్లమోతు వెంకటరమణ చండ్రుగొండ సర్పంచ్,ఇస్లావత్ రుక్మిణి,ఉపసర్పంచ్ అంతటి రామకృష్ణ మహిళాఅధ్యక్షురాలు బడుగు క్రిష్ణ వేణి, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు అన్వర్ హుస్సేన్, వార్డు సభ్యులు sk ఇమ్రాన్ NSUI మండల అధ్యక్షులు వసీం పాషా,చాపలమడుగు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ