Friday, 18 September 2026 03:05:22 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

ఓటర్ల వివరాల డిజిటలైజేషన్, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణను వేగవంతం చేయాలి – రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి.

Date : 03 August 2026 06:32 PM Views : 108

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ను పారదర్శకంగా, ఖచ్చితత్వంతో పూర్తి చేయాలి.ఓటర్ల వివరాల డిజిటలైజేషన్, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణను వేగవంతం చేయాలి – రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి.ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం–2026లో భాగంగా చేపడుతున్న ఓటరు జాబితా రూపకల్పనలో పారదర్శకత, ఖచ్చితత్వానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు.సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, సంబంధిత అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు ఐడీఓసీ కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ అంకిత్ హాజరయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా, ఖచ్చితత్వంతో అమలు చేయాలని సూచించారు. ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసి, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. డూప్లికేట్ ఎంట్రీలు, ఫోటో మిస్‌మ్యాచ్‌లు, ఏఎస్‌డీ జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి సరిదిద్దాలని చెప్పారు.ఎన్యుమరేషన్ ఫారాల్లో అవసరమైన అన్ని వివరాలను పూర్తిస్థాయిలో నమోదు చేయడంతో పాటు బూత్ లెవల్ అధికారుల (బీఎల్‌వోలు) సంతకాలు తప్పనిసరిగా ఉండేలా చూడాలని సూచించారు. శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన వారు, మరణించిన వారు, గుర్తించలేని ఓటర్ల వివరాలను మరోసారి సమగ్రంగా పరిశీలించి, సంబంధిత జాబితాలపై బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్‌ఏలు) ధృవీకరణ పొందాలని ఆదేశించారు. మ్యాపింగ్ కాని ఓటర్ల వివరాలను వెంటనే పూర్తి చేయాలని సూచించారు.పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో నమోదై ఉంటే వారందరూ ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హుడిని తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసి ఒక్క అర్హుడూ మిగిలిపోకుండా చూడాలని సూచించారు. వీవీఐపీలు, వీఐపీల ఓటరు మ్యాపింగ్‌ను సహాయ ఎన్నికల నమోదు అధికారులు స్వయంగా పరిశీలించి ధృవీకరణ పత్రాలను సమర్పించాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ , జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసి, పెండింగ్‌లో ఉన్న ప్రతి దరఖాస్తును నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. డూప్లికేట్ ఎంట్రీలు, ఫోటో మిస్‌మ్యాచ్‌లు, ఏఎస్‌డీ జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా సరిచేయాలని తెలిపారు. శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన వారు, మరణించిన వారు, గుర్తించలేని ఓటర్ల వివరాలను బీఎల్‌వోలు, బీఎల్‌ఏల సమన్వయంతో మరోసారి ధృవీకరించి జాబితాలను నవీకరించాలని ఆదేశించారు.ఒకే కుటుంబానికి చెందిన సభ్యుల ఓట్లు ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణను పకడ్బందీగా చేపట్టాలని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హుడిని తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసి వంద శాతం నమోదు లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. వీవీఐపీ, వీఐపీ ఓటర్ల మ్యాపింగ్‌ను పూర్తిస్థాయిలో ధృవీకరించాలని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 95 శాతం ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్ పూర్తయిందని, మిగిలిన ప్రక్రియను కూడా నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో ఎన్నికల సూపర్డెంట్ రంగ ప్రసాద్, ఎన్నికల సిబ్బంది నవీన్ సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :