Saturday, 19 September 2026 03:43:56 PM
# హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు.

భూ రీ సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 19 September 2026 01:50 PM Views : 67

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బూర్గంపాడు మండలంలోని పినపాక పట్టీ నగర్ రెవెన్యూ విలేజ్ అంజనాపురం ప్రాంతంలో డిజిటల్ భూ రీ సర్వే పనుల పరిశీలన భద్రాద్రి జిల్లాలో కొనసాగుతున్న భూ రీ సర్వే పనులను శనివారం జిల్లా కలెక్టర్ అంకిత్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.అందులో భాగంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలను వినియోగిస్తూ చేపడుతున్న డిజిటల్ భూ రీ సర్వే ప్రక్రియను బూర్గంపాడు మండలంలోని పినపాక పట్టీ నగర్ రెవెన్యూ విలేజ్ అంజనాపురం ప్రాంతంలో డిజిటల్ భూ రీ సర్వే పనుల జిల్లా కలెక్టర్ పరిశీలించారు.సర్వేలో అనుసరిస్తున్న విధానం, భూముల కొలతలు, వివరాల నమోదు తదితర అంశాలను బూర్గంపాడు తహసీల్దార్ ప్రసాద్ ను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు పూర్తయిన సర్వే పనుల పురోగతిపై సమీక్షించి, నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత లైసెన్సు సర్వేయర్లు యుగేందర్,అనూష లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.ఈ క్రమంలో 118 సర్వే నెంబర్ లో 1863 ఎకరాలకు గాను 1698 ఎకరాలు రీ సర్వే పూర్తయిందని జిల్లా కలెక్టర్ కు సర్వేర్లు తెలియజేశారు. అటవీశాఖకు సంబంధించిన భూములు సుమారు 200 ఎకరాలు ఉండగా వాటికి అనుమతులు వస్తే సరిహద్దులు సర్వే పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ కు సర్వేయర్లు తెలిపారు. అనంతరం స్థానిక రైతులు తమ్మినేని వెంకటేశ్వర్లు, తిరుపతయ్య,కొట్టే వెంకటేశ్వర్లు భానోత్ రాజు, దాసరి ఆదినారాయణ జిల్లా కలెక్టర్ నేరుగా మాట్లాడి భూ రీ సర్వేకు సంబంధించి వారి అభిప్రాయాలు, సమస్యలు, సందేహాలను అడిగి తెలుసుకున్నారు. సర్వే సమయంలో భూ యజమానులు తమ భూములకు సంబంధించిన వివరాలను అధికారులకు అందించి సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపడుతున్న రీ సర్వే ద్వారా భూముల వివరాలు మరింత కచ్చితంగా నమోదు కావడంతో పాటు భవిష్యత్‌లో భూ సంబంధిత సమస్యలను తగ్గించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. అధికారులు, సర్వే సిబ్బంది, రైతులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ రీ సర్వే ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యేలా సహకరించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ఈ పరిశీలనలో పినపాక పట్టీ నగర్ సర్పంచ్ బాణోత్ పద్మ,ఉప సర్పంచ్ వెంకటరమణ, అధికారులు, సిబ్బంది, స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :