Thursday, 17 September 2026 10:40:13 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

సైబర్ మోసాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్.

Date : 02 September 2026 05:53 PM Views : 94

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సైబర్ మోసాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం కళాశాలలో విద్యార్థిని, విద్యార్థులకు సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ సైబర్ నేరాల రూపాలు కూడా మారుతున్నాయని, ముఖ్యంగా విద్యార్థులు, యువత సోషల్ మీడియా, ఆన్‌లైన్ సేవలను వినియోగించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టడం, నకిలీ పోలీస్ లేదా ప్రభుత్వ అధికారులుగా పరిచయం చేసుకోవడం, పెట్టుబడులపై అధిక లాభాలు వస్తాయని నమ్మించి మోసం చేయడం, నకిలీ యాప్‌లు, లింకుల ద్వారా డబ్బులు కాజేయడం వంటి మోసాలకు సైబర్ నెరగాళ్లు పాల్పడుతున్నారని వివరించారు. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.విద్యార్థులు తమ వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, వీడియోలు, పాస్‌వర్డ్‌లు, ఓటిపిలు తదితర సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దని, అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయవద్దని సూచించారు. సోషల్ మీడియాలో పరిచయం లేని వ్యక్తులతో చాటింగ్ చేయడం, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం వల్ల ఫొటో మార్ఫింగ్, ఆన్‌లైన్ వేధింపులు వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని తెలియజేశారు.అదేవిధంగా సినిమాల్లో కనిపించే ప్రతి విషయాన్ని అనుకరించకుండా, మంచి విషయాలను మాత్రమే స్వీకరించి చెడు ప్రభావాలకు దూరంగా ఉండాలని తెలిపారు.మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేయడంతో పాటు కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. స్నేహితుల ఒత్తిడి, సరదా లేదా ఇతర కారణాలతో డ్రగ్స్‌కు అలవాటు పడవద్దని, మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను గుర్తించి, వారి ఆశయాలకు అనుగుణంగా కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులను సంప్రదించాలని సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక మరియు ఇతర సృజనాత్మక కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొని తమ ప్రతిభను పెంపొందించుకోవాలని సూచించారు. క్రమశిక్షణ, సామాజిక బాధ్యత వంటి మంచి విలువలను అలవర్చుకుని సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు విద్యార్థులతో నేరుగా ఇంటరాక్ట్ అవుతూ ప్రశ్నోత్తర కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన వివిధ ప్రశ్నలకు సమాధానాలు అందిస్తూ సైబర్ నేరాలు, సోషల్ మీడియా, డ్రగ్స్, పోక్సో, వ్యక్తిగత భద్రత తదితర అంశాలపై మరింత అవగాహన కల్పించారు.సైబర్ మోసాలకు గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. విద్యార్థులు, యువత అప్రమత్తంగా ఉంటూ సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలు మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పి ఆదినారాయణ, సీఐ ఆర్ వెంకటేశ్వర్లు, ఎస్సైలు రమణారెడ్డి, జుబేదాబేగం, కళ్యాణి, రమాదేవి, కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :