Tuesday, 03 November 2026 12:35:43 AM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

ఈ నెల 17న IIT బాంబేలో అవార్డు అందుకోనున్న జితేష్ వి. పాటిల్ IAS

Date : 15 July 2025 03:18 PM Views : 1065

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యంత్రాంగానికి ప్రతినిధిగా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, IAS కు నేషనల్ జియోస్పేషియల్ ప్రాక్టీషనర్ అవార్డు’ లభించింది. ఈ అవార్డు జూలై 17, 2025న IIT బాంబేలో జరుగనున్న ‘ఓపెన్ సోర్స్ GIS డే’ లో ISRO మాజీ చైర్మన్ కిరణ్ కుమార్ చేతుల మీదుగా ప్రదానం చేయబడనుంది. భారతదేశంలో జిల్లా స్థాయిలో మొట్టమొదటిగా ‘ఓపెన్ సోర్స్ GIS కోహార్ట్’ ఏర్పాటు చేసి, గ్రామీణ సమస్యల పరిష్కారానికి జియోస్పేషియల్ టెక్నాలజీని ప్రాక్టికల్‌గా వినియోగించడంలో కలెక్టర్ విశిష్టమైన కృషి చేశారు. గోదావరి వరదలపై ఫ్లడ్ ప్రిడిక్షన్ అనాలిసిస్ కోసం GIS ఆధారంగా పరిష్కారాలను అమలు చేయడానికి తొలిసారిగా ప్రయత్నాలు చేయడం, గ్రామీణ స్థాయిలో GIS స్కిల్లింగ్, సామర్థ్య నిర్మాణంలో ఉన్నత నమూన రూపొందించడం వలన కలెక్టర్ కు ఈ అవార్డు లభించింది. ఈ ప్రాజెక్టులో తొలి అడుగుగా, జిల్లా కలెక్టర్ చొరవతో IIT Bombay FOSSEE GIS మరియు దాని భాగస్వామి HPHF తో కలిసి భారతదేశపు మొట్టమొదటి "ఓపెన్ సోర్స్ GIS కోహార్ట్" ను మే 6, 7 తేదీలలో అనుబోస్ ఇంజనీరింగ్ కాలేజీ, కొత్తగూడెంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అగ్రికల్చర్, మైనింగ్, ఇంజనీరింగ్ విద్యార్థులు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. QGIS ద్వారా గ్రామీణ సమస్యల పరిష్కారానికి జియోస్పేషియల్ డేటా వినియోగం ఎలా చేయాలో ప్రాక్టికల్‌గా నేర్పించారు. ఉదాహరణకు, గోదావరి వరదల సమయంలో నీటి స్థాయిని బట్టి ముంపు గ్రామాలను ముందుగానే గుర్తించి హెచ్చరికలు జారీ చేయడo, వివిధ PHC మరియు సబ్ సెంటర్ పరిధిలో గల గవర్నమెంట్ స్కూల్స్ నీ GIS ద్వారా మ్యాప్ చేసి, PHC పరిధిలో విద్యార్ధులు ఆరోగ్యం పట్ల డాక్టర్లను అప్రమత్తం చేయటం. ఈ విధముగా , వివిధ శాఖల సమాచారమును, భౌగోళిక సమాచారంతో కలిపి అనాలసిస్ చేసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేలా GIS ఉపయోపడుతుంది.

భౌగోళిక డేటా ఆధారంగా క్షేత్రస్థాయి సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారాలు కనుగొనడం వంటి అంశాలపై ట్రైనింగ్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం అభివృద్ధి దశలో కొనసాగుతోంది. ఇటువంటి GIS సాఫ్ట్వేర్ అందరికీ అందుబాటులో, గ్రామీణ ప్రాంతాలకు కూడా అందించటం ముఖ్యమైన మైలురాయిగా పేర్కొనవచ్చు. తదుపరి దశలో ప్రతిభావంతమైన విద్యార్థులను ఎంపిక చేసి, IIT Bombay FOSSEE GIS సహకారంతో Open Source GIS ఉపయోగించి, గ్రామీణ సమస్యల పరిష్కారానికి భౌగోళిక సమాచారమును ఏ విధముగా ఉపయోగించాలో విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు రూపం లో నేర్పించడానికి ప్రణాళికలు రూపొందించబడ్డాయి. ఇలా మన జిల్లా అభివృద్ధి పథంలో ముందు ఉండగా, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ ఈ ప్రయత్నంలో కృషి పడిన HPHF బృందానికి, Aspirational Block Fellow నవనీత్ కి అభినందనలు తెలిపారు. ఈ అవార్డు రావడం జిల్లా వాసులందరికీ గర్వకారణం అని వెల్లడించారు. ఈ అవార్డును FOSSEE (GIS), IIT బాంబే, విద్యాశాఖ, భారత ప్రభుత్వం (NMEICT) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘నేషనల్ జియోస్పేషియల్ అవార్డ్స్ 2025 (ఎడిషన్ 02)’ కింద ప్రదానం చేయనున్నారు. జియోస్పేషియల్ టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సహించడానికి, ‘నేషనల్ జియోస్పేషియల్ పాలసీ 2022’ మరియు ‘ఇండియన్ స్పేస్ పాలసీ 2023’ కు అనుగుణంగా ఈ అవార్డులు అందించబడుతున్నాయి. భారత ప్రభుత్వం 2022 డిసెంబరు 28న జాతీయ జియోస్పేషియల్ పాలసీ 2022 ను ప్రవేశపెట్టింది. దీని ముఖ్య ఉద్దేశ్యం సామాన్య ప్రజలకు జియోస్పేషియల్ సమాచారం అందుబాటులోకి తీసుకువచ్చి, ఆ ఆధారంగా ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ, క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించుకునే అవకాశాలను కల్పిస్తూ, జాతీయ అభివృద్ధి మరియు ఆర్థిక శ్రేయస్సుకు బలమైన జియోస్పేషియల్ వ్యవస్థను ఏర్పాటు చేయడం. ఈ విధంగా జియోస్పేషియల్ టెక్నాలజీని సమర్థంగా వినియోగిస్తూ, ప్రజల సమస్యల పరిష్కారానికి ఉపయోగపడే విధంగా పనిచేస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యంత్రాంగాన్ని గుర్తించి జిల్లా కలెక్టర్ కు ఈ అవార్డు లభించడం, జిల్లాకు గర్వకారణం.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :