Sunday, 02 August 2026 06:36:02 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏం.ఎస్. ఎం. ఇ. టౌన్ హాల్ మీటింగ్.

Date : 24 March 2026 08:13 PM Views : 151

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భారతీయ రిజర్వ్ బ్యాంక్ వారు ఈ రోజు భద్రాచలం గిరిజన భవన్ లో ఔత్సాహిక వ్యాపారవేత్తలకు బ్యాంకులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాలపై అవగాహన కల్పించే విధంగా ఎం.ఎస్. ఎం. ఇ. టౌన్ హాల్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ శ్రీ. ముత్యాల ఙ్ఞాన సుప్రభాత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎం. ఎస్. ఎం. ఇ) కార్యకలాపాలను ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయ ఆధార పరిశ్రమలు, వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెంది, నిరుద్యోగ సమస్య తీరడం తో పాటు, ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన ఉత్పత్తులు అందించే అవకాశం ఉందన్నారు. తద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడతాయని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఎం. ఎస్. ఎం. ఇ.లు కీలక పాత్ర పోషిస్తున్నాయని అయన పేర్కొన్నారు. అన్ని బ్యాంకులు తాము ఇచ్చే రుణాలలో ఎం. ఎస్.ఎం. ఇ కొరకు కేటాయించిన లక్ష్యాలు సాధించాలని ఆయన సూచించారు.ప్రతి ఒక్కరూ సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే లింకులు, ఆఫర్ ల పట్ల జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు. సురక్షితమైన, అధికారిక వెబ్ సైట్లు వాడాలని, పొరపాటున సైబర్ నేరగాళ్ల బారిన పడితే వెంటనే 1930 కి కాల్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ బ్యాంక్ అధికారులు, వివిధ బ్యాంకుల అధికారులు, నాబార్డ్ జిల్లా అధికారి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి, లీడ్ బ్యాంక్ మేనేజర్, సెర్ప్ అధికారులు , సి. ఎఫ్.ఎల్ సిబ్బంది పాల్గొని వివిధ పథకాలు, అర్హత వివరాలు, దరఖాస్తు విధానం తెలియ చేశారు. భద్రాచలం పరిసర ప్రాంత ఔత్సాహిక వ్యాపారవేత్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :