Friday, 18 September 2026 08:23:06 PM
# ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

క్షేత్రస్థాయిలో పర్యటనలు పెంచి ప్రజా సమస్యలపై వెంటనే స్పందించాలి - జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 04 April 2026 05:13 PM Views : 212

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలో శనివారం జిల్లా కలెక్టర్ అంకిత్ విస్తృత స్థాయి క్షేత్ర పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, విద్యాసంస్థలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, వ్యవసాయ క్షేత్రాలు తదితరాలను సమగ్రంగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ “క్షేత్రస్థాయిలో పర్యటనలు పెంచి ప్రజా సమస్యలపై వెంటనే స్పందించాలి” అనిస్పష్టం చేశారు. ప్రజల సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించడం ప్రతి అధికారి బాధ్యత అని తెలిపారు . భూభారతి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించి, వాటిపై సమగ్ర నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. మొదటగా అనంతోగు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్, గ్రామంలో మంజూరైన 19 ఇళ్లలో ప్రస్తుతం 3 ఇళ్లు రూఫ్ స్థాయికి చేరుకున్నట్లు అధికారుల నుండి వివరాలు తెలుసుకున్నారు. లబ్ధిదారు గలిగ నాగలక్ష్మి ఇంటి నిర్మాణాన్ని ప్రత్యక్షంగా తనిఖీ చేసి, పనుల నాణ్యత, వినియోగిస్తున్న సామాగ్రి, ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు. మిగిలిన ఇళ్ల నిర్మాణాలను కూడా నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా ప్రతి అర్హ కుటుంబానికి నాణ్యమైన గృహాన్ని అందించాలన్న లక్ష్యాన్ని సాధించాలన్నారు. ఆళ్లపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, పదవ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి అభ్యాస స్థాయిని తెలుసుకుని, బయాలజీ వంటి విషయాల్లో డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయాలని సూచించారు. పాఠశాల కిచెన్, స్టోర్ రూమ్‌లను తనిఖీ చేసి, విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించాలని సిబ్బందికి ఆదేశించారు. విద్యుత్ సమస్య కారణంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిసిన నేపథ్యంలో, ఇన్వర్టర్ ఏర్పాటు ద్వారా సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆళ్లపల్లి గ్రామంలో రైతు మద్దెల వెంకటేశ్వర్లు సాగు చేస్తున్న ఆయిల్ పామ్ తోటను పరిశీలించిన కలెక్టర్, సాగు విధానం, దిగుబడి, ఆదాయం వంటి అంశాలపై రైతుతో చర్చించారు. ఆయిల్ పామ్ సాగుతో రైతులకు స్థిరమైన ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటూ, ఆధునిక సాగు పద్ధతులను అవలంబించాలని సూచించారు. మండలంలో 400 ఎకరాల లక్ష్యానికి గాను 290 ఎకరాల్లో సాగు పూర్తయిందని అధికారులు వివరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్, ఇన్‌పేషెంట్, ఔట్‌పేషెంట్ విభాగాలు, ల్యాబ్, మందుల గది తదితరాలను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అవసరమైన అన్ని మందులు సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని, వాటి సరఫరాపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. 108 అంబులెన్స్ సేవలను కూడా పరిశీలించి, అత్యవసర సేవలపై వివరాలు సేకరించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్, కార్యాలయ పనితీరు, ప్రజలకు అందిస్తున్న సేవలపై సమీక్షించారు. ఈ సందర్భంగా “క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించడంపై అధికారులు దృష్టి సారించాలి” అని స్పష్టం చేశారు. భూభారతి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. మండలంలోని త్రాగునీటి పరిస్థితిపై విచారించిన కలెక్టర్, మిషన్ భగీరథ ద్వారా సరఫరా సక్రమంగా కొనసాగుతున్నప్పటికీ, ఎండాకాలంలో తలెత్తే సమస్యలను ముందుగానే గుర్తించి ప్రత్యామ్నాయ చర్యలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. వాటర్ ట్యాంకుల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని, లేకపోతే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఫాగింగ్ యంత్రాల వినియోగంపై కూడా సమీక్షించారు. మొబైల్ సిగ్నల్ సమస్యలపై విచారించగా కొన్ని గ్రామాల్లో కనెక్టివిటీ సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. వ్యవసాయ రంగంపై సమీక్షలో భాగంగా మండలంలో సాగు అవుతున్న పంటల వివరాలు తెలుసుకున్నారు. నీటి లభ్యత, భూగర్భ జలాల పరిస్థితి, బోర్ల ద్వారా సాగునీటి అందుబాటుపై అధికారులను ప్రశ్నించారు. మహిళా సంఘాలను బలోపేతం చేసి, ప్రతి మహిళను సంఘాల్లో సభ్యురాలిగా చేర్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పనుల పురోగతిని కూడా సమీక్షించారు. విద్యాశాఖపై సమీక్ష సందర్భంగా మధ్యాహ్న భోజన పథకంలో మండలంలో ఉన్న అన్ని పాఠశాలలు మెనూ పాటించకపోవడంతో పాటు ఆహార నాణ్యత లోపాలు తమ పరిశీలనలో వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్, అన్ని పాఠశాలలను నిరంతర తనిఖీలు చేసి నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని లేనియెడల నీపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎంఈఓ శాంతారావును హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని ఆదేశించారు. త్రాగునీరు, పారిశుధ్యం, విద్య, వైద్యం, వ్యవసాయం వంటి అన్ని రంగాల్లో అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట తహసీల్దార్ జగదీష్వర్ ప్రసాద్, ఎంపీడీఓ శ్రీను, మండల ప్రత్యేక అధికారి లాల్ చంద్, ప్రధానోపాధ్యాయురాలు సరోజినీ, హెల్త్ ఎడ్యుకేటర్ రమాదేవి,వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :