Wednesday, 04 November 2026 12:59:47 PM
# మహిళా కండక్టర్ ప్రవళిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి # తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TDPS) విడుదల చేసిన తాజా వాతావరణ నివేదిక ప్రకారం ముఖ్యాంశాలు # భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు.

ఊరగుట్ట నేచర్ పార్క్ ను పర్యాటక హబ్ గా అభివృద్ధి చేయాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 09 September 2025 05:02 PM Views : 517

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఊరగుట్ట నేచర్ పార్క్ ను పర్యాటక హబ్ గా అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. ఇల్లందు మండలం సుభాష్ నగర్ లోని ఊర గుట్ట నేచర్ పార్క్ ను సందర్శించి, అక్కడ పర్యాటకులను ఆకర్షించడానికి, నేచర్ పార్క్ అభివృద్ధి కి అవకాశాలు, భవిష్యత్తులో చేపట్టవలసిన కార్యక్రమాలను సంభంధిత శాఖల అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఊరగుట్ట నేచర్ పార్క్ జిల్లాలో సహజసిద్ధమైన అద్భుత సౌందర్యాన్ని కలిగిన ప్రదేశమని, దీనిని సక్రమంగా అభివృద్ధి పరచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే, రాష్ట్ర స్థాయిలో పర్యాటకులను ఆకర్షించే అవకాశముందని పేర్కొన్నారు. పార్క్ అభివృద్ధి ద్వారా పర్యాటక రంగంలో పురోగతితో పాటు స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కలుగుతాయాన్నారు. ఊరగుట్ట నేచర్ పార్క్ లో ట్రెక్కింగ్ మార్గాలు, జిప్ లైన్, ఫ్లై ఏరియా, అడ్వెంచర్ స్పోర్ట్స్ వంటి వినోదాత్మక వసతులు ఏర్పాటు చేయడానికి తగిన ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. యువత, కుటుంబాలు, విద్యార్థులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఆకర్షితులయ్యేలా వినోదం, భద్రత, విశ్రాంతి అంశాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర చర్యలు తీసుకోవాలని సూచించారు. పార్క్ లో పరిశుభ్రత, తాగునీటి సదుపాయం, మరుగుదొడ్లు, చెత్త నిర్వహణ వంటి ప్రాథమిక వసతులు తప్పనిసరిగా కల్పించబడాలని తెలిపారు. పార్క్ లో ఏర్పాటయ్యే స్టాల్స్, ఫుడ్ కార్నర్స్, హ్యాండీక్రాఫ్ట్ ఉత్పత్తుల విక్రయ కేంద్రాలు వంటి వాటిని స్వయం సహాయక సంఘాలకు అప్పగించడం ద్వారా వారికి ఆర్థికాభివృద్ధి కలుగుతుందని, స్థానిక మహిళలకు స్థిరమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఊరగుట్ట నేచర్ పార్క్ ను జిల్లాలో పర్యాటక హబ్ గా తీర్చిదిద్దడం లక్ష్యమని, దీనిద్వారా జిల్లా పర్యాటక రంగం అభివృద్ధికి కొత్త దారులు తెరవబడతాయని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ స్పష్టం చేశారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట తహసీల్దార్ రవి, ఎఫ్ డి ఓ కరుణాకర చారి, పంచాయతీ రాజ్ ఈ ఈ శ్రీనివాస్, జిల్లా క్రీడా శాఖ అధికారి పరందామ రెడ్డి, ఏం పి డి ఓ ధన్సిగ్ మరియు సంభంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :