Monday, 03 August 2026 03:36:38 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

ఎల్-నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని పంటల మార్పిడితో రైతులు ఆదాయం పెంచుకోవాలి : జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు

Date : 22 July 2026 05:38 PM Views : 45

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎల్-నినో ప్రభావం కారణంగా వర్షపాతం తగ్గే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసి నష్టాలను నివారించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు సూచించారు. బుధవారం లక్ష్మీదేవిపల్లి మండలం గట్టుమల్ల గ్రామంలో మండల వ్యవసాయ అధికారి దీపక్‌తో కలిసి నిర్వహించిన రైతుల అవగాహన సమావేశంలో ఆయన పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ, బోరు నీటిపై ఆధారపడి వరి సాగు చేయడం వల్ల నీటి కొరత ఏర్పడి దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల ఆయిల్ పామ్, అపరాలు (పప్పుధాన్యాలు), కూరగాయలు, మొక్కజొన్న, జొన్న వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. ఆయిల్ పామ్ సాగు ద్వారా రైతులకు దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయం లభిస్తుందని, అపరాలు, మొక్కజొన్న, జొన్న వంటి పంటలు తక్కువ నీటితో సాగవడంతో పాటు మార్కెట్‌లో మంచి డిమాండ్ కలిగి ఉన్నాయని తెలిపారు. పంటల వైవిధ్యీకరణ ద్వారా భూసారాన్ని కాపాడుకోవడంతో పాటు వాతావరణ మార్పుల ప్రభావాన్ని కూడా తగ్గించుకోవచ్చన్నారు. ఎల్-నినో పరిస్థితుల్లో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ఎప్పటికప్పుడు సాంకేతిక సూచనలు అందిస్తూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. రైతులు వ్యవసాయ శాఖ సూచనలను పాటించి శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టి అధిక దిగుబడులు, మెరుగైన ఆదాయం సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి దీపక్, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :