Tuesday, 03 November 2026 11:31:59 PM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

భద్రాద్రి టీవీవీపీ ఆసుపత్రులు భేష్, ఏజెన్సీ ప్రాంతమైన సేవలు అద్భుతం. సి ఆర్ ఎం- జాతీయ బృందం కితాబు.

Date : 08 November 2025 05:51 PM Views : 353

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో వైద్య సేవలు, ప్రమాణాలు పరిశీలించడాని వచ్చిన సి ఆర్ ఎం ( కామన్ రివ్యూ మిషన్) బృంద సభ్యులు దాక్టర్ జి బి సింగ్ రాష్ట్ర స్థాయి లో నిన్న ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక లో జిల్లాలో తాము పరిశీలించిన ఇల్లందు, భద్రాచలం ఆసుపత్రుల సేవలపై ప్రత్యేక ప్రస్తావన తెచ్చారు .మారుమూల ప్రాంతాల్లో సైతం స్పెషలిస్ట్ వైద్య సేవలు అద్భుతంగా అందుతున్నాయని, మంచి ప్రమాణాలు సైతం పాటిస్తూ నాణ్యమైన వైద్యం అందిస్తున్నారని కొనియాడారు . అన్ని స్థాయిలలో సిబ్బంది సైతం ఎంతో శ్రద్ధ,అంకిత భావంతో తో సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఆసుపత్రులలో అన్ని వార్డుల ను క్షుణ్ణం గా పరిశీలించినప్పుడు చాలా మంది రోగులతో తాము మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నామని , వైద్య సేవల పై అందరూ చాలా సంతృప్తిగా ఉన్నారని అన్నారు. ఆసుపత్రులు లో వార్డులు, ఆపరేషన్ థియేటర్ , లేబర్ రూమ్ లు చాలా బాగా నిర్వహిస్తున్నారని,సానిటేషన్ కూడా బాగుందని కితాబిచ్చారు.జిల్లాలోని డయలిసిస్ సేవలు కూడా చాలా బాగున్నాయని అన్ని సెంటర్స్ లో అన్ని బెడ్స్ నిండి ఉన్నాయన్నా సంగతి తాము గమనించామని తెలిపారు.ఇల్లందు ఆసుపత్రి లో భవన స్థలం తక్కువ ఉన్నప్పటికీ సేవలు స్థాయికి మించి చేస్తున్నారని తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో సైతం రేడియాలజిస్ట్ ,మత్తు వైద్యులు , ఇతర స్పెషలిస్ట్ వైద్యులు సరిపడా స్థాయిలో ఉండడం , టిఫా స్కాన్ సేవలు సైతం ఉండడం విశేషం అని తెలిపారు. భద్రాచలం ఆసుపత్రి జిల్లాకే గర్వకారణం అని, 200 పడకలతో ఐసీయూ,ఎస్ ఎన్ సి యు , ఎన్ ఆర్ సి , ఆపరేషన్ థియేటర్ సేవలు అద్భుతంగా ,ఆదర్శంగా ఉన్నాయన్నారు.తీవ్ర స్థాయిలో సిబ్బంది కొరత ఉన్న వాటిని అధిగమించి అక్కడ ఉన్న సిబ్బంది ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని కితాబిచ్చారు.సిబ్బంది కొరత తీరితే మరింత సేవలను అందించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అన్ని స్థాయిలో ఆసుపత్రిలో ప్రమాణాల విషయం లో నిరంతరంగా శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని సూచించారు.ఆసుపత్రులలో మౌలిక వసతులు , సీ ఎస్ ఆర్ నిధుల వినియోగం మరియు ఇతర విషయాలలో జిల్లా కలెక్టర్ మద్దతు, ప్రోత్సాహం బాగుందని వారు తెలిపారు. ఈ సమావేశం లో సి ఆర్ ఎం సభ్యులతో పాటు రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ కమీషనర్ సంగీత సత్యనారాయణ, టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ కుమార్,డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీందర్ నాయక్, భద్రాద్రి జిల్లా డి సి హెచ్ ఎస్ డాక్టర్ రవి బాబు,డీఎంహెచ్ ఓ డాక్టర్ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :