Sunday, 07 June 2026 07:40:14 AM
# బిజెపి పార్టీ సీనియర్ నాయకులు సొప్పరి క్రాంతి ఆధ్వర్యంలో గౌతంపూర్ లో మొక్కలు నాటడం జరిగినది. # ఈ నెల 7, 8 తేదీల్లో రెండు రోజులపాటు ఎఐటీయూసీ సెంట్రల్ కౌన్సిల్ సమావేశం. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి. # మున్సిపల్ కార్పొరేషన్‌లో సిపిఐ పక్ష బలాన్ని సమర్థవంతంగా చాటాలి.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు # నామా వినోద్‌పై దాడి చేసిన భూకబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. # మీసేవ దరఖాస్తుల పరిశీలన పూర్తిగా ఆన్‌లైన్‌లోనే. జీపీఓలు, ఆర్‌ఐలకు అవగాహన కల్పించిన ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు. # ప్రజల ప్రాణ రక్షణకు ముందస్తు చర్యలు చేపట్టాలి. గోదావరి వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మరో రెండు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్న నేపథ్యంలో జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి. # భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప కాలనీ, రెవిన్యూ కాలనీల్లో కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్. # విద్యార్థులు సాంస్కృతిక పోటీల్లో రాణించాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పెట్రోలింగ్,బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మాస్టర్ ఈ .కె ఆధ్యాత్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కాకర్ల గ్రామం నందు ఉచిత హోమియో వైద్య శిబిరం. # భూభారతి, సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సెంట్రల్ పార్కులో ప్లాస్టిక్ ఏరివేత -మొక్కలు నాటిన ఎస్ జి ఎఫ్. # కొత్తగూడెం ఇల్లందు రహదారిపై స్కూటీని ఢీకొన్న లారీ. # పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ధరల పెరుగుదలపై రాజీలేని పోరాటం చేద్దాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # గోపన్నగూడెంలో మినీ మేడారం జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె. # జనగణన జాబితా వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా ఉండాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # సమున్నత ఆశయాలతోనే భారత జాతీయ మహిళా సమాఖ్య ఆవిర్భావం. భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి. # ప్రజా సమస్యల పరిష్కార మార్గాన్ని చూపే విధంగా గ్రామ సభలు ఉండాలి. 16వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల సమీక్షలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.

Date : 30 November 2025 01:22 PM Views : 313

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : చారిత్రాత్మక ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభానికి సమగ్ర ఏర్పాట్లు చేయాలి... అధికారులు క్రమశిక్షణతో బాధ్యతలు నిర్వర్తించాలి... ఉమ్మడి ఖమ్మం జిల్లాలోరహదారులు, నీటిపారుదల, విద్యుత్ రంగాల అభివృద్ధి... గోదావరి జలాలను ప్రతి ఎకరకు చేరవేసే దిశగా అడుగులు... డిసెంబర్ 2న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏర్పాటు చేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి విచ్చేయనున్న సందర్భంలో, ఏర్పాట్లను రాష్ట్ర వ్యవసాయ, సహకార మార్కెటింగ్, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం సమగ్రంగా పరిశీలించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, రాహుల్ తదితర అధికారులు పాల్గొన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముందుగా శిలాఫలకం ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం యూనివర్సిటీ ప్రాంగణాన్ని పర్యవేక్షించి, జరుగుతున్న పనుల పురోగతిని వివరంగా తెలుసుకున్నారు. సభాస్థలాన్ని సందర్శించిన మంత్రి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లపై అధికారుల నుండి వివరాలు తెలుసుకొని సూచనలు ఇచ్చారు. తరువాత యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొని ఏర్పాట్లను సమీక్షించారు. పత్రికా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, భూగోళ శాస్త్రాలు, సహజ వనరులు, ఖనిజ పరిశోధనలకు ప్రధాన కేంద్రంగా నిలిచే విధంగా దేశంలోనే ప్రత్యేకత కలిగిన ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని తెలిపారు. గతంలో సింగరేణి నిర్వహించిన ‘స్కూల్ ఆఫ్ మైన్స్’ అనుభవాన్ని గుర్తుచేస్తూ, జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ స్థాపనకు చేసిన కృషి గురించి వివరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విశ్వవిద్యాలయం లేమి నేపథ్యంలో ప్రత్యేక యూనివర్సిటీ అవసరాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తించి వెంటనే ఆమోదం తెలపడంతో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుందని చెప్పారు. కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సూచనలతో రూపొందించిన ప్రతిపాదనను ప్రభుత్వం నిపుణులతో ఆరు నెలలపాటు పరిశీలించి, సాధ్యతా నివేదిక ఆధారంగా అసెంబ్లీలో ప్రకటించిందని మంత్రి వివరించారు. ‘ఖనిజ సంపదలకు పుట్టినిల్లు’గా పేరుగాంచిన కొత్తగూడెం జిల్లా, అరుదైన ఖనిజ సంపద లభ్యమయ్యే ప్రాంతంగా ఉండడంతో ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ స్థాపనకు అత్యుత్తమ ప్రదేశమైందని మంత్రి తెలిపారు. దేశ ఆర్థిక సంస్కరణలకు మార్గదర్శకుడైన, పదేళ్లు భారత ప్రధానిగా పనిచేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ సేవలను గౌరవిస్తూ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని, మంత్రివర్గం మరియు అసెంబ్లీ దీనిని ఆమోదించాయని వివరించారు. జాతీయ రహదారి పక్కనే అభివృద్ధి చెందుతున్న ఈ యూనివర్సిటీ భవిష్యత్తులో ప్రపంచ స్థాయి పరిశోధనా సంస్థగా నిలవనున్నదని అన్నారు. పాల్వంచలో గడువు పూర్తి చేసిన విద్యుత్ పతి కేంద్రాలను తొలగించి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త పర్యావరణహిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణానికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపినట్లు తెలిపారు. అలాగే కొత్తగూడెం బైపాస్ రహదారి కోసం 420 కోట్ల రూపాయలతో జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించారని పేర్కొన్నారు. మెడికల్ కాలేజీలో హాస్టల్ సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి త్వరలో మంజూరు పొందనున్నట్లు తెలిపారు. సీతారామ ప్రాజెక్ట్‌లో భాగంగా డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ నిర్మాణానికి అవసరమైన 3400 కోట్ల నిధులు ముఖ్యమంత్రి ఆమోదించినట్లు వెల్లడించారు. పినపాక, మరెళ్లపాడు, తుమ్మలచెరువు , సింగం భూపాలం, అశ్వరావుపేట, అన్నదైవంపాడు, ముకమామిడి అభివృద్ధితోపాటు డిస్ట్రిబ్యూటర్ కెనాల్ భూసేకరణకు నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. దీని ద్వారా వైరా, సత్తుపల్లి, మధిర, అశ్వరావుపేట, కొత్తగూడెం, పినపాక నియోజకవర్గాలకు గోదావరి జలాలు అందనున్నాయని చెప్పారు. కొత్తగూడెం–ఇల్లందు–హైదరాబాద్ రహదారి నిర్మాణానికి ఆమోదం లభించగా పనులు ప్రారంభించబడ్డాయని మంత్రి తెలిపారు. భద్రాచలం–మణుగూరు– ఏటూరునాగారం –చౌటాల రహదారి నిర్మాణం కోసం అటవీ శాఖ రెండు లైన్ల రహదారికి అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు పనులు పురోగతిగా ఉన్నాయని తెలిపారు . ఖమ్మం కేంద్రంగా సూర్యాపేట–రాజమహేంద్రవరం–నాగపూర్–అమరావతి రహదారులు పూర్తి కానున్నాయని, ఖమ్మం–భద్రాద్రి జిల్లాల అభివృద్ధి కోసం రింగురోడ్లు కూడా ఆమోదించబడ్డాయని వివరించారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధిలో భాగంగా రహదారులు, నీటిపారుదల విద్యుత్ రంగాలలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్టు మంత్రి వెల్లడించారు.

ఈ సందర్భంగా కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, పాల్వంచ పునర్జీవనంలో భాగంగా విద్యుత్ ఉపకేంద్రాల మంజూరు ప్రజల్లో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. కొత్తగూడెం పట్టణంలో సింగరేణి సహకారంతో నూతన బస్టాండ్ నిర్మించేందుకు, పాల్వంచలో జెన్‌కో సహకారంతో ఆధునిక బస్టాండ్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధిని ప్రతిబింబించేలా అన్ని సౌకర్యాలతో బస్టాండ్ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, కొత్తగూడెం జిల్లాలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ స్థాపన గర్వకారణమని ఎమ్మెల్యే తెలిపారు. డిసెంబర్ 2న జరిగే యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తరువాత ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై జిల్లాస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్ని శాఖల వారీగా చేపడుతున్న పనుల పురోగతిని, బాధ్యతల అప్పగింపును మంత్రి కి వివరించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ముఖ్యమంత్రి పర్యటనకు చేపడుతున్న భద్రతా చర్యలు, ఏర్పాట్లను వివరించారు. శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి వ్యక్తిగతంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భూ పరిశోధనల వంటి రంగాల్లో దేశస్థాయిలో విద్యార్థులకు ఉపయోగపడే ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో అధికారులు అత్యంత క్రమశిక్షణతో తమ బాధ్యతలను నిర్వర్తించాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఎటువంటి లోటుపాట్లకు అవకాశం లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను సమగ్రంగా పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పర్యటన సజావుగా సాగేందుకు ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనను ప్రజల ప్రతిష్ఠకు తగిన విధంగా అత్యుత్తమంగా నిర్వహించేందుకు అందరూ కలిసి పనిచేయాలని కోరారు. పర్యటన విజయవంతం చెయ్యాలని అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, కొత్తగూడెం ఆర్డీవో మధు అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :