Monday, 03 August 2026 04:27:34 PM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు పంటల సాగు చర్యలు చేపట్టాలి. రైతులకు వ్యవసాయ శాఖ అధికారి బాబురావు సూచనలు.

Date : 14 June 2026 05:35 PM Views : 92

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా రైతులు ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఖరీఫ్ సీజన్ వ్యవసాయ పనులను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని వ్యవసాయ శాఖ అధికారి బాబురావు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో జూన్ 8వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించడంతో రానున్న రోజుల్లో సాధారణం నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.వర్షాధార పంటల సాగుకు అనుకూల పరిస్థితులు నెలకొన్నందున రైతులు పత్తి, సోయాబీన్, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర, మినుము, ఆముదం వంటి పంటల సాగుకు సిద్ధం కావాలని సూచించారు. విత్తనాల ఎంపికలో ధృవీకరించబడిన, నాణ్యమైన విత్తనాలను మాత్రమే ఉపయోగించాలని తెలిపారు.పొలాల్లో అధిక తేమ లేకుండా నీరు నిల్వ కాకుండా కాలువలు ఏర్పాటు చేయాలని, నేలలో తగిన తేమ ఉన్నప్పుడే విత్తనాలు వేయాలని సూచించారు. కృష్ణా జిల్లాలో సాధారణం కంటే తక్కువ, ములుగు జిల్లాలో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సాగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.చెరువులు, కుంటలు మరియు ఇతర నీటి వనరులను శుభ్రపరచి వర్షపు నీటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడరాదని, పశువులను కూడా అక్కడ ఉంచరాదని రైతులకు హెచ్చరించారు.వేరుశనగ, సోయాబీన్, జొన్న, పెసర, కంది, మినుము వంటి పంటల విత్తనాలను విత్తే ముందు శాస్త్రీయ పద్ధతిలో విత్తన శుద్ధి చేయడం ద్వారా ప్రారంభ దశలో వచ్చే వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. వరి నారుమళ్ల కోసం నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకొని, తెలంగాణ సోనా (RNR-15048) వంటి అధిక దిగుబడి రకాలను వినియోగించాలని సూచించారు.వాతావరణ శాఖ జారీ చేసే సూచనలు, హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు తీసుకుని సాగు పనులు చేపట్టాలని రైతులకు వ్యవసాయ శాఖ అధికారి బాబురావు విజ్ఞప్తి చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :