Wednesday, 16 September 2026 09:18:22 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

రైతు సంక్షేమానికి కృషి విజ్ఞాన కేంద్రాల పాత్ర కీలకం – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ .

Date : 28 October 2025 06:18 PM Views : 425

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రైతు సంక్షేమానికి కృషి విజ్ఞాన కేంద్రాల పాత్ర కీలకం అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. మంగళవారం కొత్తగూడెం లోని కృషి విజ్ఞాన కేంద్రం (KVK) ను సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా ఆయన కేంద్రంలో చేపడుతున్న నూతన వ్యవసాయ సాంకేతిక పద్ధతులు, భూసార పరీక్షా కేంద్రం కార్యకలాపాలు, సమగ్ర వ్యవసాయ నమూనా యూనిట్లను సమీక్షించారు. కేంద్రంలోని పరిశోధన, శిక్షణా కార్యక్రమాలు, రైతు అవగాహన కార్యక్రమాలపై శాస్త్రవేత్తలతో చర్చించి, రైతు సంక్షేమానికి కృషి విజ్ఞాన కేంద్రం అందిస్తున్న సేవలను ఆయన ప్రశంసించారు.ఈ సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి. భరత్ జిల్లా వ్యాప్తంగా రైతులకు అందిస్తున్న సాంకేతిక మార్గదర్శకత, పంటల విస్తరణ కార్యక్రమాలు, వివిధ ప్రభుత్వ పథకాల అనుసంధానం, మరియు శిక్షణా కార్యక్రమాలపై కలెక్టర్ కి సమగ్రంగా వివరించారు.అనంతరం గిరిజన ఉపాధి పథకం (Tribal Sub Plan) కింద కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇల్లందు మండలంలోని పోపెల్లి గ్రామానికి చెందిన రైతులతో ముచ్చటించి, పట్టుపురుగుల పెంపకం, విప్పపువ్వు సాగు, సమగ్ర వ్యవసాయం పద్ధతులు వంటి ఆధునిక వ్యవసాయ విధానాలపై వారికి అవగాహన కల్పించారు. రైతులు ఆధునిక పద్ధతులను అవలంబిస్తే పంటల దిగుబడి పెరుగుతుందని, ఆదాయం కూడా పెరుగుతుందని కలెక్టర్ సూచించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ..కృషి విజ్ఞాన కేంద్రాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. రైతులకు శాస్త్రీయ అవగాహన, సాంకేతిక సహాయం, మరియు సమగ్ర వ్యవసాయ పద్ధతుల ప్రచారం ద్వారా రైతు ఆదాయాన్ని పెంచడంలో ఈ కేంద్రాల పాత్ర అత్యంత ప్రాముఖ్యమైనది అని పేర్కొన్నారు.తరువాత కలెక్టర్ కృషి విజ్ఞాన కేంద్రంలో చేపట్టవలసిన అభివృద్ధి పనులు, భవిష్యత్ ప్రణాళికలు, విత్తనోత్పత్తి క్షేత్రాలు, మరియు రైతు మద్దతు సేవలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన భూసార పరిశీలన సదుపాయాలు విస్తరించాలి, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పంట రకాలను అభివృద్ధి చేయాలి, మరియు రైతులకు సాంకేతికత చేరే విధంగా డిజిటల్ అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు.అనంతరం కలెక్టర్ చేతులమీదుగా గిరిజన రైతులకు తార్పాలిన్లు మరియు వ్యవసాయ ఉపయోగ సామగ్రిని అందజేశారు.ఈ కార్యక్రమం లో శాస్త్రవేతలు డాక్టర్. హేమ శరత్ చంద్ర మరియు బి. శివ, రైతులు సంబధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :