Thursday, 17 September 2026 10:41:00 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

దశాబ్దాల కల సాకారం. మారెళ్ళపాడు లిఫ్టులో గోదావరి పరవళ్లు. మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.

Date : 07 September 2026 10:18 AM Views : 123

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దశాబ్దాల కల సాకారం.. •మారెళ్ళపాడు లిఫ్టులో గోదావరి పరవళ్లు.16 వేల ఎకరాలకు సాగునీరు.మంత్రి తుమ్మల కృషికి ఫలితం.విజయవంతమైన ట్రయల్‌ రన్‌.రైతన్నల్లో హర్షాతిరేకాలు.ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రత్యక్ష పర్యవేక్షణతో గడువులోగా పూర్తి.మణుగూరు, అశ్వాపురం మండలాల రైతుల కళ్లలో దశాబ్దాలుగా మెరుస్తున్న ఆశ నేడు సాకారమైంది. వానలు సరిగా కురవక, భూగర్భ జలాలు అడుగంటి బీడుగా మారిన భూములకు గోదావరి తల్లి నీరు అందించాలన్న రైతన్నల చిరకాల వాంఛ మారెళ్ళపాడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకం రూపంలో నెరవేరింది. ఈ పథకం ట్రయల్‌ రన్‌ విజయవంతంగా పూర్తి కావడంతో మణుగూరు, అశ్వాపురం మండలాల పరిధిలోని 16 వేల ఎకరాలకుపైగా ఆయకట్టుకు ఇక సాగునీటికి కొదవ ఉండదన్న భరోసా లభించింది.మంత్రి తుమ్మల కృషి ఫలించింది.సీతారామ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన నాటి నుంచే ఈ ప్రాంత రైతుల గోడు తెలిసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తుమ్మలచెరువుతో పాటు అశ్వాపురం మండలాన్ని సస్యశ్యామలం చేయాలన్న సంకల్పంతో మారెళ్ళపాడు ప్రాజెక్టు ప్రతిపాదనలకు ప్రాణం పోశారు. మొదటి బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడే అంచనాలు రూపొందించి, రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రతిపాదనలకు మంజూరు తెప్పించారు. అప్పటి ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు శంకుస్థాపన చేసినా, ప్రభుత్వం మారడంతో ప్రాజెక్టు మూలనపడుతుందేమోనని రైతులు ఆందోళన చెందారు. అయితే రైతు పక్షపాతిగా పేరున్న తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రి కావడంతో పరిస్థితి మారింది. ఒకటికి పదిసార్లు ప్రాజెక్టును సందర్శించి, అధికారులను పరుగులు పెట్టించి పనులు పూర్తి చేయించారు.ఎమ్మెల్యే నిరంతర పర్యవేక్షణ.పనులు గడువులోగా పూర్తయ్యేలా చూడాలంటూ మంత్రి తుమ్మల.. స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు బాధ్యత అప్పగించారు. ఆగస్టు నెలాఖరుకల్లా తుమ్మలచెరువుకు నీళ్లు అందించి తీరాలన్న మంత్రి ఆదేశాల మేరకు, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు దాదాపు 20 రోజులపాటు రేయింబవళ్లు ప్రాజెక్టు వద్దే మకాం వేసి పనులను స్వయంగా పర్యవేక్షించారు. ఫలితంగా నిర్ణీత గడువులోగానే ట్రయల్‌ రన్‌ విజయవంతంగా పూర్తయింది. రైతుల్లో ఆనందోత్సాహాలు,దశాబ్దాల కల నెరవేరడంతో తుమ్మలచెరువు ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన పనులను సైతం యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, ఇంకా సాగునీరు అందని ఆయకట్టు రైతులను ఆదుకోవాలని రైతుల తరఫున పినపాక నియోజకవర్గ మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్, తుమ్మల వీరాభిమాని కోలేటి భవానీశంకర్‌ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరారు.ప్రాజెక్టు ముఖచిత్రం.మారెళ్ళపాడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా మణుగూరు, అశ్వాపురం మండలాల్లోని సుమారు 16,180 ఎకరాలకు సాగునీరు అందనుంది. రూ.113.17 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ పథకంలో మెయిన్‌ కెనాల్‌ పొడవు 9.850 కి.మీ. ఉండగా, తొలిదశలో 7 వేల ఎకరాలకు నీరందించే ఏర్పాట్లు చేశారు. సీతారామ మెయిన్‌ కెనాల్‌ నుంచి ఎత్తిపోతల ద్వారా ఈ నీటిని అందిస్తారు.మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిరంతర పర్యవేక్షణతో ప్రాజెక్టు తుది రూపు సంతరించుకుంది.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :