Friday, 19 June 2026 01:38:02 PM
# టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ. # ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే నియంత్రించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షాహిద్, వరక అజిత్. # అమృత్ పథకం నిధులతో వేగవంతంగా సాగుతున్న నీటి పథకాల నిర్మాణ పనులు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. # సాధారణ ప్రసవాలను పెంచాలి – మాతృ, శిశు మరణాలను తగ్గించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. Dr తుకారాం రాథోడ్ DMHO. # గుడిపాడు యూపీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్.

జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. Dr తుకారాం రాథోడ్ DMHO.

Date : 09 June 2026 07:16 PM Views : 64

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ (DMHO) ఆధ్వర్యంలో ప్రతి వారం నిర్వహించే సమీక్ష సమావేశం ఈ రోజు జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. తుకారాం రాథోడ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది, ఈ సమావేశంలో జిల్లాలోని ప్రోగ్రాం ఆఫీసర్లు అందరు పాల్గొన్నారు.సమావేశంలో వివిధ ఆరోగ్య కార్యక్రమాల పురోగతిని సమీక్షిస్తూ, ముఖ్యంగా సాధారణ ప్రసవాలను పెంచడం, మాతృ మరియు శిశు ఆరోగ్య సేవల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించారు.అలాగే యాంటీ మలేరియా కార్యక్రమాలు, ఆంటీ డయేరియల్ ప్రోగ్రాం, ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలు, HPV వ్యాక్సినేషన్ కార్యక్రమాల అమలు స్థితిని సమీక్షించారు. ఈ కార్యక్రమాలను మరింత బలోపేతం చేసి, జిల్లాలో వ్యాధుల నియంత్రణకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.TB నోటిఫికేషన్‌ను పెంచడం, అనుమానిత ట్యూబర్‌క్యులోసిస్ కేసుల నుంచి స్పుటం శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించడం, నిర్ధారిత రోగులకు సకాలంలో మందులు అందించడం పై ప్రత్యేకంగా సూచించారు.అదేవిధంగా రక్తపోటు (BP), షుగర్ పరీక్షలను క్రమం తప్పకుండా నిర్వహించి, అవసరమైన వారికి నిరంతర మందుల సరఫరా జరిగేలా చూడాలని ఆదేశించారు. అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించి, అనుమానిత కేసులను ఉన్నత స్థాయి ఆసుపత్రులకు రిఫర్ చేయాలని సూచించారు.పాలియేటివ్ కేర్ సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచిస్తూ, అవసరమైన దీర్ఘకాలిక రోగులకు ఇంటి వద్దనే సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.అలాగే ప్రజలు ధూమపానం, మద్యపానం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మంచి ఆహారపు అలవాట్లు పాటించాలని, ప్రతిరోజూ శారీరక శ్రమ చేయాలని సూచించారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా వ్యాధులను నివారించవచ్చని సమావేశంలో అవగాహన కల్పించారు. ABAS హాజరు విధానం, సమయపాలన, ఫీల్డ్ స్థాయి సేవల నాణ్యత, ఆరోగ్య కేంద్రాల పనితీరు వంటి అంశాలపై కూడా సమీక్ష నిర్వహించారు. ప్రతి ప్రోగ్రాం అధికారి తమకు అప్పగించిన లక్ష్యాలను సమయానికి పూర్తి చేయాలని, ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలని సూచించారు.ప్రజారోగ్య సూచికలను మెరుగుపరచడానికి సమన్వయంతో పని చేయాలని, ప్రతి ఆరోగ్య సిబ్బంది బాధ్యతతో విధులు నిర్వర్తించాలని సమావేశంలో స్పష్టం చేశారు. ప్రజలకు అందుతున్న సేవల్లో ఎటువంటి లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని ఆయన తెలియజేశారు. మాతృ మరణాలు జరగకుండా నివారించాలని హైరిస్కు గర్భిణీలకు ప్రత్యేక శ్రద్ధతో సేవలు అందించాలని తెలియజేశారు , చిన్నపిల్లలకు అర్హులైన అందరికీ అన్ని రకాల వ్యాక్సిన్లు సకాలంలో వేయాలని ఆదేశించారు. సమావేశం చివరలో అన్ని ప్రోగ్రాం అధికారులు తమ ప్రగతి నివేదికలను సమర్పించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రసాద్ ప్రోగ్రాం ఆఫీసర్, డాక్టర్ సాయి కళ్యాణ్ Dy DMHO, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ప్రతాప్, డాక్టర్ దినేష్ , డాక్టర్ హరీష్ , డాక్టర్ రాకేష్ పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :