తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వరి పంట: పొలాల్లో నిల్వ ఉన్న వర్షపు నీటిని వెంటనే బయటకు పంపించాలి. వరి కంకులు తడిసి ధాన్యం మొలకెత్తకుండా ఉండటానికి లీటరు నీటికి (ట్యాంకు నీటిలో) 100 గ్రాముల ఉప్పు కలిపి పిచికారీ చేయాలి. మిరప పంట: నేలకొరిగిన మొక్కలను తిరిగి నిలబెట్టి కర్రల ఆధారంతో కట్టాలి. మొక్కల మొదళ్ల వద్ద మట్టిని ఎగదోయాలి. తేమ వల్ల తెగుళ్లు రాకుండా సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. నష్టం అంచనా: అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి మండలాల్లో భారీ వర్షాల వల్ల ప్రాథమికంగా 1600 ఎకరాల్లో మినుము, 1500 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు గుర్తించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ