తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఒకేషనల్ ఓజేటి కోసం మెయింటెనెన్స్ చార్జ్ అని తీసుకొని విద్యార్థులకు భారాన్ని పెంచొద్దని కొత్తగూడెం జి జి హెచ్ అడిషనల్ సూపర్డెంట్ కి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మెమొరండం ఇవ్వడం జరిగింది అనంతరం ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్ కె, ఫహీమ్ దాదా మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఓజేటి కోసం ఒకేషనల్ విద్యార్థుల దగ్గర మెయింటినెన్స్ చార్జీలు అడగడం సరైనది కాదని ఒకేషనల్ విద్య అభ్యసించే వారిలో బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనారిటీ విద్యార్థులు ఎక్కువ ఉన్నారని 45 రోజుల ఓజేటీ కోసం మెయింటినెన్స్ ఛార్జ్ ద్వారా విద్యార్థులకు అధిక భారం అవుతుందని, వృత్తి విద్య నైపుణ్యమునకు దూరం చేసే ధోరణి అవలంబించోద్దని ఆయన కోరడం జరిగింది, సూపర్డెంట్ గారు సానుకూలంగా స్పందించి పై అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లివిద్యార్థులకు న్యాయం జరిగే విధంగా చూస్తామని హామీ ఇవ్వడం జరిగింది.... ఈ కార్యక్రమంలో ఖయ్యూం,వినయ్,కిషోర్, శివ,రణధీర్ మరియు విద్యార్థులు పాల్గొనడం జరిగింది..
Admin
తెలుగు వెలుగు టీవీ