Thursday, 17 September 2026 10:40:10 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

ప్రతి ఒక్కరూ స్వీయ క్రమశిక్షణతో రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలి: ఎస్పీ రోహిత్ రాజు.

Date : 13 January 2026 06:36 PM Views : 283

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సుజాతనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో Arrive-Alive కార్యక్రమం ప్రారంభోత్సవం.జిల్లా వ్యాప్తంగా పది రోజుల పాటు రోడ్డు భద్రతపై అవగాహనా కార్యక్రమాలు.రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు,రవాణా,ఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో అవగాహన కల్పించడం కోసం ఏర్పాటు చేసిన వినూత్న కార్యక్రమమే Arrive-Alive-2026 అని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. రోడ్డు ప్రమాదాలను నియంత్రించడానికి ప్రజలకు అవగాహన కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన Arrive-Alive కార్యక్రమాన్ని జిల్లాలో మంగళవారం నాడు సుజాతనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పాల్గొన్నారు. కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో సుజాతనగర్ మండల పరిసర ప్రాంతాల ప్రజలు,ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ హెల్మెట్ వినియోగం, సీటు బెల్ట్ ప్రాధాన్యత,డిఫెన్సివ్ డ్రైవింగ్ నియమాల గురించి వివరించారు.రోడ్డు భద్రతా నియమాలను పాటించడంలో స్వీయ క్రమశిక్షణ కలిగి ఉంటే చాలావరకు రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని అన్నారు.రోడ్డుపై విధులలో పోలీసులు ఉన్నా,లేకపోయినా వాహనాలను నడిపేటప్పుడు నియమ,నిబంధనలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని కోరారు.జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలను గౌరవించి తమ ప్రాణ భద్రతతో పాటు,ఇతరుల భద్రతకు కూడా సహకరించాలని జిల్లా ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.డ్రంక్ అండ్ డ్రైవ్,ర్యాష్ డ్రైవింగ్,సెల్‌ఫోన్ డ్రైవింగ్,రాంగ్ రూట్,సిగ్నల్ జంపింగ్,ఓవర్ లోడ్ వలన కలిగే ప్రమాదాల గురించి వివరించారు.అనంతరం సుజాతనగర్ పరిధిలో రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబ సభ్యులు వారి ప్రస్తుత పరిస్థితిని అక్కడ పాల్గొన్న ప్రజలకు వివరించారు.అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు,ప్రజలు,ప్రజా ప్రతినిధులు రోడ్డు భద్రతా నియమాల ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,ట్రైనీ ఆర్డీఓ మురళి,జిల్లా రవాణాధికారి భూషితా రెడ్డి, ఆర్టీసి డిఎం రాజ్యలక్ష్మి,ఎంఆర్ఓ కృష్ణ,మోటారు వాహనాల అధికారులు వెంకట రమణ,వెంకట పుల్లయ్య,వైద్యారోగ్య శాఖ అధికారులు,సీఐలు ప్రతాప్,శ్రీలక్ష్మి,వెంకటేశ్వర్లు,సుజాతనగర్ ఎస్సై రమాదేవి,ఎస్సైలు రమణారెడ్డి,ప్రవీణ్,రవి తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :