Wednesday, 16 September 2026 02:00:38 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

గణేష్ మండపాల నిర్వాహకులు నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి : జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్

Date : 18 August 2025 04:17 PM Views : 1290

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మండపాల ఏర్పాటు కొరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. జిల్లాలో గణేష్ మండపాల నిర్వహణకు ఉత్సవ కమిటీ సభ్యులు తెలంగాణ పోలీసు శాఖ వారు రూపొందించిన పోర్టల్ ???? https://policeportal.tspolice.gov.in/ నందు ధరఖాస్తు చేసుకోవాలని, ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ అనేది కేవలం మండపాల నిర్వహణ, మండపానికి సంబంధించిన సమాచారం కొరకు మాత్రమేనని,ఈ సమాచారంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత మరియు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడానికి పోలీసులకు సులభంగా ఉంటుందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ తెలిపారు.పోలీసు శాఖ ఆన్లైన్ ద్వారానే అనుమతి మంజూరు చేయడం జరుగుతుందని, ఆ తరువాతనే వినాయక మండపాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి ప్రతిమలను ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గణేష్ ఉత్సవ కమిటీలు పాటించవలసిన నియమ నిబంధనలు: గణేష్ మండపాల పూర్తి బాధ్యత మండపాల నిర్వహకులదే. ప్రతీ మండపం వద్ద తప్పని సరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. నిర్దేశించిన సమయానికి నిమజ్జనం పూర్తి చేయాలి. గణేష్ మండపాలు ప్రజా రవాణాకు,ఎమర్జెన్సీ వాహనాలకు, ట్రాఫిక్ నకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలి. మండపం ఏర్పాటు చేసే స్థలం కోసం యజమాని మరియు సంబంధిత శాఖల వారితో అనుమతులు తీసుకోవాలి. మండపాల కమిటీ వివరాలు,బాధ్యత వహించే వారి వివరాలు,ఫోన్ నెంబర్లను మండపంలో ఏర్పాటు చేయాలి. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలి. మండపాల్లో మరియు శోభాయాత్ర సమయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలను ఏర్పాటు చేయరాదు. మండపం వద్ద 24 గంటలు ఒక వాలంటీర్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో పాటు వాలంటీర్లను నియమించుకోవాలి. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా దగ్గరలో ఇసుక మరియు నీటిని అందుబాటులో ఉంచుకోవాలి. గణేష్ మండపాల వద్ద మద్యంసేవించడం,పేకాట ఆడటం, అసభ్యకరమైన నృత్యాలు,అన్యమతస్తులను కించపరిచే విధంగా ప్రసంగాలు/పాటలు పూర్తిగా నిషేధం. మండపం వద్ద పాయింట్ పుస్తకం ఏర్పాటు చేసుకోవాలి,విధిగా పోలీసు అధికారుల తనిఖీకి వచ్చినప్పుడు అందులో వ్రాసి సంతకం చేస్తారు. అనుమానాస్పదమైన బ్యాగులు, ప్లాస్టిక్ సంచులు,వస్తువులు,వ్యక్తులు కనిపించినట్లయితే వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. సామాజిక మాధ్యమాలలో వచ్చే ఎలాంటి వదంతులను నమ్మకూడదని,ఎవరికైనా ఎలాంటి సందేహాలు ఉంటే వెంటనే సంబంధిత పోలీసు అధికారులను లేదా Dial 100 నంబర్‌ను సంప్రదించాలని ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ సూచించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :