Thursday, 17 September 2026 10:32:03 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు.

Date : 31 July 2026 06:55 PM Views : 108

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు, ఈరోజు జిల్లాస్థాయిలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద 8 రకాల పోటీలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆధ్వర్యంలో భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జ్యూడిషల్ ఫస్ట్ క్లాస్ మినిస్ట్రీట్ బి. శివ నాయక్ గారు యువతను ఉద్దేశించి మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వికసిత్ భారత్ సాధించడానికి యువత పాత్ర చాలా ముఖ్యమని తెలిపారు. యువత డ్రగ్ తీసుకోవడంలో భద్రాచలం ముందు ఉందని, అందులోనూ చత్తీస్గడ్ బార్డర్ దగ్గర ఉండడంతో యువత అనేది చేజారిపోతుందని వారికి సరైన అవగాహన లేకపోవడంతో చదువుకోకుండా వారు తప్పుదారి పడుతున్నారని, నా దగ్గర వచ్చే కేసులో ఎక్కువగా యూత్ ఉన్నారు. యువత మీద ఒకసారి పోలీస్ కేస్ పడితే వారికి ప్రభుత్వ ఉద్యోగాలు మరియు వేరే దేశాలకు వెళ్లే అవకాశాలు కోల్పోతారు, మన భారతదేశం భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కవిత్వము, పెయింటింగ్, స్లోగన్ రైటింగ్, ఉపన్యాస పోటీలు, గ్రూపు డాన్స్, గ్రూప్ సాంగ్, షార్ట్ ఫిలిం లేదా రీల్, స్కిట్ పోటీలు నిర్వహించి గెలుపొందిన యువతకు బహుమతులు అందజేశారు. ఈ జిల్లా స్థాయి పోటీలలో మొదటి బహుమతి సాధించిన వారు పెయింటింగ్- పి. అనూష, షార్ట్ ఫిలిం/రీల్స్ - బి. రమ్య, కవిత రచన- జి. అక్షయ, స్లోగన్ రైటింగ్- ఇ. కళ్యాణి, ఉపన్యాస పోటీలు- బి. పద్మావతి, నాటకం - కె. స్రవంతి అండ్ టీం, గ్రూప్ డాన్స్- సిహెచ్. నీలిమ అండ్ టీం , గ్రూప్ సాంగ్- పి. ధన్మిక అండ్ టీం. ఈ జిల్లా స్థాయి పోటీలలో మొదటి బహుమతి సాధించిన వారు రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని మేరా యువ భారత్ జిల్లా యువ అధికారి వెంకట రాంబాబు గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జ్యూడిషల్ ఫస్ట్ క్లాస్ మినిస్ట్రీట్ బి. శివ నాయక్, ప్రొఫెసర్ జాన్ మిల్టన్ ప్రిన్సిపాల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ భద్రాచలం, డాక్టర్ వేముల కామేశ్వరరావు ఎన్ ఎస్ ఎస్ డిస్ట్రిక్ట్ కన్వీనర్, మేరా యువ భారత్ జిల్లా యువ అధికారి ఎం.వెంకట్ రాంబాబు, జాగృతి యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ షారుఖ్ ఇమ్రాన్ మరియు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :