Wednesday, 16 September 2026 04:25:04 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

రైతుల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలి – బీజేపీ కిసాన్ మోర్చా

Date : 22 June 2026 03:17 PM Views : 200

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్‌కు మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుకూరి రమేష్ మాట్లాడుతూ, వానాకాలం (ఖరీఫ్) సీజన్-2026 ప్రారంభమై రోజులు గడుస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికీ స్పష్టమైన వ్యవసాయ ప్రణాళిక లేదని విమర్శించారు. విత్తనాల విత్తకం నుండి పంటల కొనుగోలు పూర్తయ్యే వరకు ప్రభుత్వం అనుసరించబోయే విధానంపై రైతులకు స్పష్టత కల్పించాలని డిమాండ్ చేశారు. ఏ జిల్లాలో ఎంత విస్తీర్ణంలో ఏ పంటలు సాగు చేయాలి, ఎరువుల లభ్యత ఎంత మేరకు ఉంటుంది, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఎలా ఉంటుందనే అంశాలపై ముందస్తు కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలని కోరారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాల విక్రయాలు పెరిగిపోతున్నాయని, ముఖ్యంగా పత్తి, మిర్చి, వరి విత్తనాల పేరుతో కొందరు ప్రైవేట్ డీలర్లు రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రైతులు భారీగా పెట్టుబడులు పెట్టి దిగుబడులు రాక అప్పులపాలై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. నకిలీ విత్తనాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకొని రైతులకు నాణ్యమైన, అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలను సబ్సిడీపై అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే రబీ సీజన్‌కు సంబంధించిన పెండింగ్ రైతు భరోసా నిధులు మరియు ప్రస్తుత ఖరీఫ్ సీజన్ రైతు భరోసా నిధులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. రైతులందరికీ రూ.2 లక్షల వరకు సంపూర్ణ రుణమాఫీ అమలు చేయాలని, వ్యవసాయ కూలీలకు రూ.12 వేల ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఎరువుల పంపిణీని యాప్ ఆధారంగా కాకుండా నేరుగా రైతులకు అందించే విధానం చేపట్టాలని, యూరియా మరియు ఇతర ఎరువుల కొరత లేకుండా చూడాలని సూచించారు. పంటల బీమా పథకాన్ని తక్షణమే అమలు చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులు మరియు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మాదినేని సతీష్, గొట్టిపూళ్ల దుర్గా శ్రీనివాసు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రవీందర్, సముద్రాల గాయత్రి, పాల్వంచ టౌన్ అధ్యక్షులు రాపాక రమేష్, బలగం శ్రీధర్, నవీన్, తెల్లం నరసింహారావు, నిమ్మటూరి రామారావు, బానోత్ కుమార్, గడ్డం అజయ్ కుమార్, భూక్య మోహన్ తదితర బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :