Monday, 02 November 2026 10:00:28 PM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి భర్తరఫ్ చేయాలి

Date : 09 September 2026 03:49 PM Views : 159

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ముఖ్యమంత్రి పదవిలో ఉన్నన్ని రోజులు అంబేద్కర్ జయంతులకు,వర్ధంతులకు నివాళులర్పించని దుర్మార్గుడు కేసీఆర్ : జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ కొత్తగూడెం అసెంబ్లీ స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ శాసనమండలి సభ్యులు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డి లను వెంటనే పదవి నుంచి భర్తరఫ్ చేయాలని జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ డిమాండ్ చేశారు. బుధవారం పార్టీ శ్రేణులతో కలిసి పోస్ట్ ఆఫీస్ అంబేద్కర్ విగ్రహం ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సంధర్భంగా కామేష్ మాట్లాడుతూ అసెంబ్లీ స్పీకర్ పై శాసన మండలి సభ్యులు మాట్లాడిన దానికి కెసిఆర్ క్షమాపణలు చెప్పాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ అని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదిన్నర ఏళ్లలో ఎన్నడూ అంబేద్కర్ జయంతులకు, వర్ధంతులకు నివాళులర్పించని దుర్మార్గుడు కేసీఆర్ అని విమర్శించారు. తాతా మధు వొళ్ళు మదమెక్కి స్పీకర్ పై మాట్లాడారని అదే స్థానంలో దళిత వర్గానికి చెందిన స్పీకర్ కాకుండా అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి స్పీకర్ గా ఉండి ఉంటే ఇలానే మాట్లాడేవారా అని ప్రశ్నించారు.బీఆర్ఎస్ పార్టీ,జరిగిన ఘటనకు పశ్చాత్తాపం తెలపకుండా నిన్నటి రోజున దళితులు ఎర్రవల్లి ఫాం హౌజ్ వద్దకు వెళ్తే పసుపు నీళ్లతో శుద్ధి చేయడం, ఫాం హౌజ్ వద్ద దళితుల మీద దాడులు చేయడం అంటేనే దళితుల పట్ల వారి వైఖరి ఏంటో అర్థం అవుతుందని ఎద్దేవా చేశారు.దళితుడు స్పీకర్ గా ఉన్నందునే ఎక్కడ అధ్యక్క్షా అని మైక్ అడగాల్సి వస్తుందో అని ప్రజా సొమ్మును జీతంగా తీసుకుంటూ అసెంబ్లీకీ రాని ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన శాసన మండలి సభ్యులను వెంటనే భర్తరఫ్ చేయాలని లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాలోత్ వీరు నాయక్,శంకర్,బాబా,రాంబాబు,కమలి,శారద తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :