తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఇల్లెందు పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించడంతో పాటు, రోడ్డుపై అడ్డంగా నిలబడి ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగించి, పోలీసు సిబ్బంది విధుల నిర్వహణకు ఆటంకం కలిగించిన బండి వెంకటేశ్వర్లు, మద్దెల గోపి, బండి రాజయ్యలపై ఇల్లందు పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ ఘటనకు సంబంధించి ముగ్గురినీ పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, న్యాయస్థానం వారిని రిమాండ్‌కు పంపించింది. సమస్యలు లేదా వివాదాలు తలెత్తినప్పుడు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకుండా, చట్టబద్ధమైన మార్గాల్లో పరిష్కరించుకోవాలని ఇల్లందు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యాయత్నం చేస్తామని బెదిరించడం, పెట్రోల్ వంటి ప్రమాదకర పదార్థాలను ఉపయోగించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం, రహదారులను దిగ్బంధించి ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగించడం, పోలీసుల విధుల నిర్వహణకు ఆటంకం కలిగించడం వంటి చర్యలకు పాల్పడరాదని హెచ్చరించారు.ఇలాంటి చర్యల వల్ల ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లడమే కాకుండా, ప్రజా శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకరిస్తూ, తమ సమస్యలను చట్టబద్ధమైన మార్గాల్లో పరిష్కరించుకోవాలని పోలీసులు కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ