తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : స్వచ్ఛతా హీ సేవా–2026 కార్యక్రమంలో భాగంగా 1వ రోజు షెడ్యూల్‌లో భాగంగా పాల్వంచ మండలం లక్ష్మీదేవిపల్లి(S) గ్రామ పంచాయతీ పరిధిలోని గురుకుల పాఠశాలలో జిల్లా పంచాయతీ అధికారి బి. అనూష పాల్గొన్నారు.ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు SWM Rules–2026లో సూచించిన నాలుగు రకాల వ్యర్థాల వేరు వేరు సేకరణ (4-Way Segregation) పై అవగాహన కల్పించారు. వ్యర్థాలను మూలస్థాయిలోనే సక్రమంగా వేరు చేయడం, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యం మరియు పర్యావరణ పరిరక్షణ, సుస్థిరత ప్రాముఖ్యతను వివరించారు.విద్యార్థులు తమ ఇళ్లలో, పాఠశాలలో మరియు పరిసరాల్లో పరిశుభ్రతను పాటిస్తూ, వ్యర్థాలను వేరు చేసి నిర్వహించేలా చైతన్యం కల్పించారు.ఈ కార్యక్రమంలో లక్ష్మీదేవిపల్లి(S) గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులు, పాల్వంచ MPO, పంచాయతీ కార్యదర్శి, గురుకుల పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ