Thursday, 05 November 2026 11:37:55 PM
# ఎమ్మెల్సీ ఓటరు దరఖాస్తుల పరిశీలన 15 రోజుల్లో పూర్తి చేయాలి: సీఈవో సుదర్శన్ రెడ్డి. # స్మశానవాటికల పరిశుభ్రతకు మేయర్ గణేష్ ఆదేశం. # గ్రాడ్యుయేట్ల ఓటు నమోదు ముమ్మరం చేయాలి: సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # మురుసు తుఫాన్‌ బాధిత రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి: సీపీఐ డిమాండ్. # భద్రాద్రి కొత్తగూడెంలో ఐఎఫ్‌ఎంఐఎస్ జిల్లా స్థాయి శిక్షణ విజయవంతం. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిరుద్యోగులకు సువర్ణావకాశం: భారత్ హ్యుందాయ్‌లో ఉద్యోగాల భర్తీకి శనివారం ఇంటర్వ్యూలు! # శాశ్వత పనులతో జిల్లాను మోడల్‌గా నిలపాలి: మంత్రి తుమ్మల. # తుపాను నష్టంపై మంత్రి పొంగులేటి ఉన్నతస్థాయి సమీక్ష. # తుఫాను నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలి: సీపీఐ డిమాండ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా . # బేతుపల్లి చెరువు వరదల్లో చిక్కుకున్న 19 మంది సురక్షితం. # సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి యువజనోత్సవాల ఎంపిక పోటీలు.క్రీడల అధికారి వి. అనూష. # సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐటీయూసీ డిమాండ్ # మురసు తుఫాను పంట నష్టం: రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. # లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యను నివారిస్తాం: మేయర్ మూడ్ గణేష్. # ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతిపై సీపీఐ దిగ్భ్రాంతి: రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. # పాములేరు వాగు వరద ఉధృతిని పరిశీలించిన ఎస్పీ రోహిత్ రాజు # కండక్టర్ ప్రవళిక మృతి బాధాకరం: కుటుంబానికి కోటి రూపాయల బీమా, ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.మంత్రి పొన్నం ప్రభాకర్. # మహిళా కండక్టర్ ప్రవళిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి # తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TDPS) విడుదల చేసిన తాజా వాతావరణ నివేదిక ప్రకారం ముఖ్యాంశాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా బాలల ఆరోగ్య మరియు రోగనిరోధక టీకాల కార్యక్రమం.

Date : 04 July 2026 08:29 PM Views : 254

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా బాలల ఆరోగ్య మరియు రోగనిరోధక టీకాల కార్యక్రమం సమర్థవంతంగా అమలవుతున్న నేపథ్యంలో, నేడు జిల్లా బాలల ఆరోగ్య మరియు రోగనిరోధక టీకాల కార్యక్రమ అధికారి (PO-CH&I) డా. ప్రతాప్, సీహెచ్‌ఓ జి. నాగభూషణంతో కలిసి మంగపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఐఎల్‌ఆర్ (Ice Lined Refrigerator), డీప్ ఫ్రీజర్, కోల్డ్ చైన్ నిర్వహణ, ఉష్ణోగ్రత రికార్డులు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి, వ్యాక్సిన్ల నాణ్యత పరిరక్షణకు సంబంధించిన మార్గదర్శకాలను సిబ్బందికి వివరించారు.అనంతరం కొబ్బరిపాడు, ఒడ్డుగూడెం, రాజుపేట కాలనీ గ్రామాలలో నిర్వహిస్తున్న రోగనిరోధక టీకాల సెషన్లను సందర్శించి, టీకాల నిర్వహణ విధానం, లబ్ధిదారుల నమోదు, యూ-విన్ పోర్టల్‌లో నమోదు, వ్యాక్సిన్ లాజిస్టిక్స్, రికార్డుల నిర్వహణ, లబ్ధిదారులకు అందుతున్న సేవలను పరిశీలించారు. టీకాలకు అర్హులైన ప్రతి చిన్నారికి, గర్భిణికి మరియు ఇతర లబ్ధిదారులకు సకాలంలో టీకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు.తదనంతరం *పాల్వంచ ఐడీఓసీ (DMHO కార్యాలయం)*లో సూపర్‌వైజర్లు మరియు ఏఎన్‌ఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డ్యూ లిస్ట్, సెషన్ ప్రణాళిక, యూ-విన్ డేటా నమోదు, కోల్డ్ చైన్ నిర్వహణ, టీకాల కవరేజ్ మెరుగుదల, రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించి, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించాలని సూచించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :