Wednesday, 16 September 2026 05:08:20 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

గిరిజన మహిళా సమాఖ్యల ద్వారా ఇసుక ర్యాంపుల ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకోవాలి. మైనింగ్ శాఖ ఎండి భవేష్ మిశ్రా ఐ ఏ ఎస్.

Date : 27 May 2025 07:44 PM Views : 584

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో పీసా యాక్ట్ ప్రకారం మహిళా సమాఖ్య ల ద్వారా ఇసుక ర్యాంపుల ఏర్పాటు మరియు నిర్వహణకు అన్ని చర్యలు చేపట్టాలని మైనింగ్ శాఖ ఎండి భవిష్య మిశ్రా ఐ ఏ ఎస్ అన్నారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయం సమావేశం మందిరంలో గిరిజన సమైక్యల ద్వారా ఇసుక ర్యాపుల ఏర్పాటు మరియు నిర్వహణ కు తీసుకోవలసిన చర్యల పై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, భద్రాచలం ఐ టిడిఏ పి. ఓ రాహుల్ మరియు ములుగు ఐటీడీఏ పీవో చిత్ర మిశ్ర తో కలిసి టిజీ ఎం డి సి, ఐ టి డి ఏ మరియు మైనింగ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా ముందుగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ జిల్లాలో ఉన్నటువంటి ఇసుక ర్యాంపుల వివరాలు మరియు ప్రస్తుతం ఇసుక రాంపుల నిర్వహణలో చేపడుతున్న పద్ధతులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మైనింగ్ శాఖ ఎండికి వివరించారు. అనంతరం మైనింగ్ శాఖ ఎండి భవేష్ మిశ్రా మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన సొసైటీల ద్వారా ఇసుక ర్యాంపుల నిర్వహణ చేపట్టడం ద్వారా గిరిజన కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెంది వారి జీవ నోపాధి పెంపొందించుకోవడానికి ఎంతగానో తోడ్పడుతుందన్నారు. గిరిజన మహిళా సంఘాల ద్వారా ఇసుక ర్యాంపుల నిర్వహణ కు ఐటిడిఎ ద్వారా అవసరమైన వాహనాలు మరియు యంత్ర పరికరాలు సమకూర్చడం జరుగుతుందన్నారు. దీని ద్వారా గిరిజన మహిళా సమాఖ్యలకు మూడు రెట్ల అధిక ఆదాయం సమకూర్తుందన్నారు. ఇసుక ర్యాంపుల నిర్వహణకు ఏజెన్సీ ప్రాంతమైన గిరిజనులకు ఐటీడీఏ మరియు మైనింగ్ శాఖ అధికారులు సరైన అవగాహన కల్పించాలన్నారు. ఏర్పాటు చేసే ప్రతి ఇసుక రాంపులలో మహిళా సమాఖ్యలకు తోడ్పాటున అందించే విధంగా ఐటిడిఏ నుండి ఒక అధికారి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 8 మరియు ములుగు జిల్లాలో మూడు ఇసుక ర్యాంపులు ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ములుగు మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు వారాల్లో ఇసుక ర్యాంపులకు ఏర్పాటుకు ఉత్సాహవంతులైన మహిళా సమాఖ్య సభ్యులను గుర్తించాలన్నారు. ముందుగా ప్రయోగాత్మకంగా ములుగు మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఒక ఇసుక ర్యాంపును ప్రారంభించే విధంగా వారికి శిక్షణ అందించాలని సూచించారు. గిరిజన మహిళలు సమర్థవంతంగా ఇసుక ర్యాంపుల నిర్వహణ చేయడానికి అన్ని విధాల ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. సమావేశంలో కొత్తగూడెం ఆర్డీవో మధు, భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావు, స్పెషల్ ఆఫీసర్ అశోక్ కుమార్, తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు మేనేజర్ శంకర్ నాయక్, ఏడి మైన్స్ దినేష్ కుమార్ మరియు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :