Wednesday, 16 September 2026 07:35:02 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 20 February 2025 06:41 PM Views : 721

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఫిబ్రవరి 20 (తెలుగు వెలుగు) : మార్చి 5 నుండి ప్రారంభ మయ్యే ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తో కలిసి సమావేశం నిర్వహించారు. గురువారం ఐడిఓసి కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఇంటర్‌ విద్య, పాఠశాల విద్య, రెవెన్యూ, పోలీసు, ప్రజా రవాణా, వైద్య ఆరోగ్యం, విద్యుత్‌, పోస్టల్‌ తదితర శాఖల అధికారులతో ఇంటర్ పరీక్షల నిర్వహణపై జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలని అన్నారు. పరీక్ష కేంద్రాలలోకి ఎవరు సెల్ఫోన్ తీసుకొని వెళ్లడానికి అనుమతి లేదని గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకునే విధంగా అవసరమైన రూట్ లలో బస్సు సర్వీసులు నడిచేలా చేపట్టాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులతో ఒక ఏఎన్ఎంను కేంద్రాల వద్ద అందుబాటులో ఉండేలా వైద్య అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. విద్యుత్ శాఖ అధికారులు పరీక్షా సమయంలో ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాలలో తాగునీరు తదితర మౌలిక వసతులు ఉండేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.పరీక్షలను సజావుగా నిర్వహించడానికి ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లను చేర్చడం ద్వారా కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో ముందుగానే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.పరీక్షా సమయంలో పరీక్షా కేంద్రాల ఏరియాలలో జిరాక్స్ సెంటర్లు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్టమైన నిఘా ఉండాలని, ఇందుకు గాను కస్టోడియన్ మరియు డిపార్ట్మెంటల్ అధికారులను నియమించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి వెంకటేశ్వర చారి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి భాస్కర్ నాయక్, ఏ ఆర్ డి ఎస్ పి సత్యనారాయణ, టేకులపల్లి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ సులోచన రాణి కొత్తగూడెం ఇల్లందు పాల్వంచ మున్సిపల్ కమిషనర్లు శేషంజన్ స్వామి, శ్రీకాంత్,సుజాత తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :