Monday, 03 August 2026 09:04:21 PM
# నూతన జీఎంను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన ఎఐటీయూసీ నాయకులు. # సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం.

నూతన జీఎంను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన ఎఐటీయూసీ నాయకులు.

Date : 03 August 2026 06:51 PM Views : 246

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నూతన జీఎంను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన ఎఐటీయూసీ నాయకులు.ఉత్పత్తి–ఉత్పాదకతతో పాటు కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేయాలని విజ్ఞప్తి. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వెంకటరమణను గుర్తింపు కార్మిక సంఘం ఎఐటీయూసీ నాయకులు సోమవారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించిన నాయకులు, నూతన బాధ్యతల్లో ఆయన విజయవంతంగా రాణించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఎఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ, సింగరేణి సంస్థ అభివృద్ధి, కార్మికుల సంక్షేమం అనే రెండు లక్ష్యాలను సమన్వయం చేస్తూ తమ సంఘం దశాబ్దాలుగా నిరంతరం పోరాటాలు చేస్తూ, యాజమాన్యంతో సానుకూల చర్చలు నిర్వహిస్తూ అనేక సమస్యలకు పరిష్కారాలు సాధించిందన్నారు. ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుతో పాటు కార్మికుల సంక్షేమం, భద్రత, ఆరోగ్యం, సంక్షేమ పథకాల అమలుకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.ఏరియాలో పెండింగ్‌లో ఉన్న కార్మిక సమస్యలను ప్రాధాన్యత ఆధారంగా పరిష్కరించడం, కార్మికులకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయడం, పారిశ్రామిక సంబంధాలను సుహృద్భావ వాతావరణంలో కొనసాగించడం ద్వారా సంస్థ మరింత అభివృద్ధి చెందుతుందని వారు అభిప్రాయపడ్డారు.కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారంలో యాజమాన్యం సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఎఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి వి. మల్లికార్జున్ రావు, సహాయ కార్యదర్శి జె. గట్టయ్య, ఆఫీస్ బేరర్లు సందేబోయిన శ్రీనివాస్, శేషగిరిరావు, గుమ్మడి వీరయ్య, పిట్ కార్యదర్శులు ఎం.ఆర్.కే. ప్రసాద్, మధుకృష్ణ, కమల్, భూక్యా రమేష్, సౌజన్య, నాయకులు,పి. చంద్రయ్య, బండారు మల్లయ్య, మెంగన్ రవి, మెంగన్ రోషన్, శశివర్ధన్ రెడ్డి, కరుణాకర్, సాంబమూర్తి, అవినాష్, రాజ్‌కుమార్, అప్పారావు, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, వాసంతిక, సంధ్యారాణి, భూపతి రమణ, అశ్విని, ఓం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :