Monday, 03 August 2026 12:50:19 PM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా విధులు నిర్వర్తించాలి : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

Date : 16 March 2026 04:43 PM Views : 198

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పోలీస్ అధికారులు,కోర్టు డ్యూటీ ఆఫీసర్స్ తో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు గల కాన్ఫరెన్స్ హాలులో సోమవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న SHO లు,కోర్టు డ్యూటీ ఆఫీసర్లతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి బాధ్యతగా విధులు నిర్వర్తించాలని సూచించారు.న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ పాత కేసుల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు.కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు తమ అధికారులకు తెలియజేస్తూ ఉండాలని సూచించారు.ఏవైనా సందేహాలు తలెత్తితే డీసిఆర్బీ అధికారులకు తెలియజేసి వాటిని నివృత్తి చేసుకోవాలని తెలిపారు.కేసు నమోదయినప్పటి నుండి పరిష్కారం అయ్యే వరకు ప్రతీ విషయాన్ని ఆన్లైన్లో పొందుపరిచాలని టెక్ టీం ఆపరేటర్లకు సూచించారు.ఆన్లైన్లో పొందుపరిచే క్రమంలో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే ఐటి సెల్ సహకారం తీసుకోవాలని అన్నారు.5S అమలులో భాగంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని,కేసులకు సంభందించిన ఫైళ్ళను క్రమపద్దతిలో అమర్చుకోవాలని సూచించారు.నేరస్తులకు శిక్ష పడే విధంగా కృషి చేసి బాధితులకు న్యాయం చేకూర్చడంలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ,పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్,మణుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డి,ఇల్లందు డిఎస్పీ వెంకన్న బాబు,డీసిఆర్బీ సీఐ శ్రీనివాస్,ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మరియు ఇతర అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :