Thursday, 17 September 2026 03:23:51 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాకు అందించాలి ,మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి ..

Date : 09 June 2025 05:51 PM Views : 678

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ , అధ్యక్షులు రేగా కాంతారావు గారి ఆదేశాల మేరకు వనమా వెంకటేశ్వరరావు సూచనల మేరకు తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి ఆధ్వర్యంలో ఎమ్మార్వో పుల్లయ్య గారికి మెమోరండం ఇవ్వడంఇవ్వడం జరిగింది..సీతారామ ప్రాజెక్టు జలాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రైతాంగానికి అందించాలని కొత్తగూడెం మున్సిపల్ తాజా మాజీ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు, కార్యకర్తలతో కలిసి తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం తాసిల్దార్ పుల్లయ్యకు వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలో ప్రవహిస్తున్న గోదావరి జలాలను భద్రాద్రి జిల్లా రైతాంగానికి అందించాలని కోరారు. ముగ్గురు మంత్రులు ఉండి స్థానిక రైతాంగానికి సాగునీరు ఇవ్వకపోవడం జలదోపిడి అవుతుందని చెప్పారు. జిల్లా రైతులకు సాగునీరు ఇచ్చాకే ఇతర ప్రాంతాలకు తరలించాలని హితవు పలికారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు 420 హామీలను అమలు చేయాలన్నారు. 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కాక వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే ఏడాదిన్నర కాలం పూర్తయిందని, 6 గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేదాకా పార్టీ పక్షాన ప్రజల పక్షాన నిరంతరం పోరాడతామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు పార్టీ సీనియర్ నాయకులు మాజీ కాన్సిలర్ వేముల ప్రసాద్ బాబు ,మాజీ కౌన్సిలర్ తొగరు రాజశేఖర్, మాజీ మండల అధ్యక్షుడు హుస్సేన్, జయరాం, మాజీ సర్పంచ్ గుమ్మడి సాగర్, మైనారిటీ సెల్ నాయకులు ఖాజా భక్ష్, ఎస్సీ సెల్ నాయకులు రావెళ్ళ మధు, ఎస్టీ సెల్ నాయకులు పూర్ణచందర్, రేణిగుంట్ల రాంబాబు, సూరిబాబు, రాచపల్లి శ్రీనివాస్, సుందర్ పాసి, నిజాం, కిమ్, తలుగు అశోక్, ఎండీ రషీద్, ప్రశాంత్, చంద్రశేఖర్, మహిళా నాయకులు ఎండీ రెహనా సుల్తానా, శైలజ, సంధ్య, జ్యోతి, మాధవి, ఎండీ ఖతీజ, నందిని, కళావతి, వెన్నెల, కాత్యాయని కార్యకర్తలు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :