Tuesday, 03 November 2026 06:41:14 AM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఆకస్మికంగా తనిఖీ : జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 01 September 2026 03:14 PM Views : 251

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాఠశాలలో భవనాలు, వంటగది, స్టోర్ రూమ్, డైనింగ్ హాల్, ఆర్.ఓ.ఆర్ ప్లాంట్ పరిశీలన విద్యార్థులకు వండిన ఆహార పదార్థాలను క్షుణ్ణంగా పరిశీలించి, వివరాలు తెలుసుకున్న జిల్లా కలెక్టర్ స్టోర్ రూమ్ లో నిల్వ ఉన్న,కుళ్ళిన వంట సామాగ్రీ పదార్థాలపై క్యాటరింగ్ అసిస్టెంట్ మంగీలాల్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ సక్రమంగా విధుల నిర్వహించాలని సిబ్బందిని హెచ్చరించిన జిల్లా కలెక్టర్ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రామవరం ప్రాంతంలో గల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ - పాల్వంచ, ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా మంగళవారం తనిఖీ చేశారు.ఈ పాఠశాల 15 ఎకరాల విస్తీర్ణంలో 2017 ఏడాదిలో నిర్మించగా గతంలో పాల్వంచ ప్రాంతంలో ఉండగా,ప్రస్తుతం కొత్తగూడెం ప్రాంతానికి తరలించిన ఈ ఏకలవ్య మోడల్ స్కూల్ లో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 480 మంది విద్యార్థులకు విద్యా తరగతులు, వసతి సౌకర్యాలు అందుతుండగా, ఆ భవన సముదాయాలను, పరిసర ప్రాంతాలను జిల్లా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పే ఉపాధ్యాయులు, సిబ్బంది వివరాలు జిల్లా కలెక్టర్ పాఠశాల ఇన్చార్జి మున్సిపల్ ప్రశంజీత్ భూసాల్ ను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో టీచింగ్ విభాగంలో 23 రెగ్యులర్ సిబ్బంది, 12 మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని, నాన్ - టీచింగ్ విభాగంలో ఐదుగురు ఔట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారని తెలిపారు.240 మంది బాలికలకు,240 మంది బాలురకు ప్రత్యేక వార్డెన్స్ వేర్వేరుగా ఉన్నారని, పాఠశాల ప్రిన్సిపాల్ ఏ. విజయ గత నెల ఆగస్టు 17వ తేదీ నుంచి సెలవుల్లో ఉన్నట్లు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ అంకిత్ పాఠశాల ఆవరణలో ఉన్న డైనింగ్ హాలులో వంట వండుతున్న కుకింగ్ ప్రాంతాన్ని పరిశీలించారు. విద్యార్థుల కోసం వండిన వంటకాలను అన్నం, పప్పు, సాంబార్,రసం, పెరుగు, కోడిగుడ్లను, రాత్రి భోజనం కోసం వంట చేసేందుకు సిద్ధం చేసుకున్న కాయగూరలను పరిశీలించి కుకింగ్ చేసే వంట మనిషితో, హెల్పర్లతో మాట్లాడారు. ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నారని, నాణ్యతతో కూడిన పౌష్టికాహారం విద్యార్థులకు సిద్ధం చేసి అందజేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అప్పుడే విద్యార్థులతో పాటు పాఠశాల ఆవరణ ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. అదేవిధంగా డైనింగ్ హాల్ లో ఉన్న స్టోర్ రూమ్, ఆర్.ఓ.ఆర్ ప్లాంట్ ప్రాంతాలను తనిఖీ చేశారు. స్టోర్ రూమ్ లో ఉన్న కాయగూరలు, ఉల్లిగడ్డ, నిల్వ ఉన్న పప్పు దినుసులు, బియ్యం,సబ్బులు, సరపు, షాంపులు, తదితర సామాగ్రిని ఎప్పుడు కొనుగోలుచేశారని, ఎంతకాలం నుంచి నిల్వ ఉంచుతారని క్యాటరింగ్ అసిస్టెంట్ మంగీలాల్ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో నిల్వ ఉన్న బెల్లం కుళ్ళి ఉండడాన్ని పరిశీలించి క్యాటరింగ్ అసిస్టెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేసి సక్రమంగా పనిచేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏకలవ్య పాఠశాలలో వాచ్మెన్ గా పనిచేస్తున్న సుజాత తన సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళింది.విధులు నిర్వహించాలంటే సెక్యూరిటీ రూమ్ లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని సెక్యూరిటీ రూమ్ నిర్మించేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేసింది.అదేవిధంగా పాఠశాలకు రావాలంటే విద్యార్థులు,ఉపాధ్యాయ సిబ్బంది సరైన రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని, అంతర్గత రోడ్లు పరిస్థితి మరీ దారుణమని పలు సమస్యలు జిల్లా కలెక్టర్ కు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట కొత్తగూడెం తహసిల్దార్ పుల్లయ్య, రెవెన్యూ సిబ్బంది బాలరాజు తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :