తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ది,01/08/2026న సుజాతనగర్ ముఖ్య కార్యకర్తల సమావేశం చింతలపూడి సత్యం భవన్ లో కామ్రేడ్ గండమాల భాస్కర్ అధ్యక్షతన సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా కి ముగ్గురు మంత్రులు ఉండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సీతారామ ప్రాజెక్టు నీళ్లు ఇవ్వాలని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసులకు సీతారామ ప్రాజెక్టు నీళ్లు వచ్చేవరకు పోరాటం చేస్తాం.సిపిఎం పార్టీ అనేక పోరాటాల ఫలితంగా నాడు తమ్మినేని వీరభద్రం గారు 2003లో మహాప్రస్థానం పేరిట దుమ్ముగూడెం ప్రాజెక్టు నీళ్లు జిల్లాలో చేసి అన్ని చెరువులకు అనుసంధానం చేస్తూ జిల్లా సస్యశ్యామల కావాలి అనే ఉద్దేశంతో జరిగినటువంటి పాదయాత్ర ఫలితంగా పాలక ప్రభుత్వాలు దుమ్ముగూడెం ప్రాజెక్టు పేరు మీద కొంత పని ప్రారంభించి దాని తర్వాత పాలకులు మారిన దాన్ని సీతమ్మ సీతారామ ప్రాజెక్టుగా నామకరణం చేశారని ఈ తరుణంలో ఈ ప్రాజెక్టు పేరు మీద జిల్లాలో కొన్ని వేల ఎకరాలకు నీరు అందించే విధంగా ఈ యొక్క ప్రాజెక్టు మొదటి డిజైన్ చేశారని దాని తర్వాత జిల్లాలో ఏ ఒక్క ఎకరానికి ఇవ్వకుండా చెరువులు కుంటలు నింపకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు అన్యాయం చేస్తూ సీతారామ ప్రాజెక్టు నీళ్లు వైరా మధిర సత్తుపల్లి కి నీళ్లు తీసుకెళ్తున్నారని ఇది చాలా అన్యాయమని ముగ్గురు మంత్రులు బట్టి విక్రమార్క తుమ్మల నాగేశ్వరావు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పక్షపాత ధోరణిని అవలంబిస్తున్నారని ఈ సంవత్సరం వల్ల వర్షాలు సరిగా పడక చెరువులు కుంటలు నిన్నలేదని తక్షణమే సీతారామ ప్రాజెక్టు నీళ్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్ని చెరువులకు అనుసంధానం చేయాలని సుజాతనగర్ మండలంలో ఉన్నటువంటి సింగభూపాలెం ప్రాజెక్టుకు తక్షణమే సీతారామ ప్రాజెక్టు నీళ్ళు ఇచ్చి ఈ ప్రాంత రైతాంగని ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు జిల్లా కమిటీ కున్సోత్ ధర్మా గారు సిపిఎం మండల కార్యదర్శి వీర్ల రమేష్ మండల కార్యదర్శి వర్గ సభ్యులు గూని నాగాచందర్ మండల కమిటీ సభ్యులు భూక్య శంకర్ జ్యోతిరావు ఉడుగుల శ్రీకాంత్ వీర్ల మల్లేష్ చిమట వెంకటేష్ సోలం నాగరత్నమ్మ జబ్బ సావిత్రి సిరిగిరి మురళి బాలు భద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ