తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి ప్రధాన కార్యాలయం, మెయిన్ వర్క్‌షాప్‌లో శనివారం నిర్వహించిన తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్ సాధన విజయోత్సవ సభలో ఎఐటియుసి కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్ పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్‌ను సింగరేణికే కేటాయించాలని 2013లోనే ఎఐటియుసి తొలి ఉద్యమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. అనంతరం 2017 మే నెలలో "సింగరేణి జాతా" పేరుతో తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్‌ను సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేస్తూ బస్సు యాత్ర నిర్వహించిన ఏకైక కార్మిక సంఘం ఎఐటియుసినేనని పేర్కొన్నారు.తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్ సాధనలో కార్మికులు, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాలు అందించిన సహకారం అభినందనీయమని ఆయన అన్నారు.అదేవిధంగా, జేవీఆర్ ఓసీ–3, కోయగూడెం, శ్రావణపల్లి,మణుగూరు డిప్‌సైడ్ బ్లాక్‌లను కూడా సింగరేణికే కేటాయించి సంస్థ మనుగడను కాపాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించి, కార్మికులకు రావాల్సిన లాభాల వాటాను చెల్లించాలని కోరారు. అలాగే, సింగరేణి సంస్థకు జెన్‌కో నుంచి రావాల్సిన రూ.56 వేల కోట్ల బకాయిలను వెంటనే వసూలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విజయోత్సవం తాడిచర్ల–2 సాధనలో ఎఐటియుసి పోరాట చరిత్రను మరోసారి గుర్తు చేసిన సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ (ఆపరేషన్స్),డైరెక్టర్ (పీపీ),జిఎం (సిపిపీ),జీఎం (వెల్ఫేర్),సిఎంఓఏ నాయకులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ