Wednesday, 16 September 2026 07:38:17 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

మణుగురు పీకే బ్లాక్ సింగరేణికి దక్కడం హర్షణీయం. - విలేకరుల సమావేశంలో ఎంఎల్ఎ కూనంనేని.

Date : 05 August 2026 07:28 PM Views : 163

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మణుగురు పీకే బ్లాక్ సింగరేణికి దక్కడం హర్షణీయం. ఇది సిపిఐ ఏఐటియూసి విజయం.భవిష్యత్లో సింగరేణి మనుగడ కోసం మరిన్ని పోరాటo.ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం గట్టి ప్రయత్నం.సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగామ మార్చేందుకు కృషి.పాస్పోర్టు కార్యాలయం ఏర్పాటుకు చర్యలు.కొత్తగూడెం బైపాస్కు రూ.500 కోట్లు మంజూరు.సీతారామ ప్రాజెక్టు ద్వారా ఎక్కువ ఆయకట్టుకు కృషి. విలేకరుల సమావేశంలో ఎంఎల్ ఎ కూనంనేని.మణుగూరు పికే బ్లాక్ సింగరేణికి దక్కడం హర్షణీయమని, ఇది సిపిఐ, ఏఐటియూసి విజయమని, భవిష్యత్లో సింగరేణి సంస్థ మనుగడకు మరిన్ని ఐక్య పోరాటాలు నిర్వహిస్తామనిసిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎంఎల్ఎ కూనంనేని సాంబశివరావు అన్నారు. బుధవారం స్థానిక సిపిఐ కార్యాలయం శేషగిరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మణుగూరు పికే ఓసి డిప్ ప్రైవేటు పరం కాకుండా సిపిఐ ఏఐటియూసి కలిసి చేసిన పోరాట ఫలితంగానే సింగరేణికి దక్కిందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పలు మార్లు చేసిన అభ్యర్ధన మేరకు సింగరేణికి దక్కడంతో కార్మికులంతా ఆనందంతో ఉన్నారని తెలిపారు. తాడిచెర్ల బొగ్గు బ్లాక్ కూడా సింగరేణికే దక్కిందని గుర్తు చేసారు. కొత్తగూడెం ప్రాంతం మనుగడ సాగేందుకు పెనగడవ, పెనుబల్లి రాంపురం అనిశెట్టిపల్లి పునుగుడుచెలక హేమచంద్రాపురం ప్రాంతాల్లో ఓపెన్ కాస్ట్లు చేయవచ్చని చెప్పారు. కొత్తగూడెంలో ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నామని, ఇక్కడ ఎయిర్ పోర్టు ఏర్పాటు కావడం ద్వారా ప్రయాణాలు సులవుతాయని, పారిశ్రామిక ప్రాంతమైన ఈ జిల్లాలో ఎయిర్ పోర్టు ఎంతో అవసరమని చెప్పారు. కొత్తగూడెం కేంద్రంగా పాస్పోర్టు సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, పోస్టాఫీసు అనుసంధానంగా ఈ పాస్పోర్టు సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని, ఇందుకు సానుకూల స్పందన వస్తోందన్నారు. కొత్తగూడెం జిల్లా ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించామని, ఇందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ఇప్పటికే రూ.10 కోట్లతో నేషనల్ స్కిల్ డవల్ఫ్మెట్ సెంటర్ ఏర్పాటుకు అనుమతులు వచ్చాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కేంద్రీయ విద్యాలయం కూడా త్వరలో జిల్లాకు రానుందని కూనంనేని తెలిపారు. కొత్తగూడెం బస్టాడ్ పునః నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. అదే విధంగా పాల్వంచ బస్టాండ్ను కూడా నూతన హంగులతో తీర్చిదిద్దేంకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కొత్తగూడెం బైపాస్కు రూ.500 కోట్ల నిధులు మంజూరయ్యాయని, ఈ బైపాస్ రోడ్ నిర్మాణం పూర్తయితే పట్టణంలో వాహనా రద్దీ తగ్గనుందన్నారు. నియోజకవర్గ సమాగ్రాభివృద్ధికి పెద్ద ఎత్తున కృషి చేస్తున్నామని, ప్రాధాన్యతా క్రమంలో నిధులు వెచ్చించి ప్రజలకు మౌళిక వసతులు కల్పించేందుకు కృషి జరుగుతుందన్నారు. చిన్నచిన్న గ్రామాలు మొదలుకుని పట్టణాలు, కార్పొరేషన్ వరకు సిసి రోడ్లు, డ్రైన్లు, వీధి దీపాలు, పరిశుభ్రమైన తాగునీరు అందించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతూ నిధులు తెప్పించి పనులు చేస్తున్నామని కూనంనేని తెలిపారు. కొత్తగూడెం మున్సిపల్ ఎదురైన తక్షణమే పరిష్కరించేందుకు ప్రతీ బుధవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. రాబోయే రోజుల్లో నియోజక వర్గాన్ని అన్ని విధాలు అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు శక్తి వంచన లేకునండా కృషి చేస్తామని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గుర్తింపు సంఘం (ఏఐటియూసి) ప్రధాన కార్యదర్శి కొరిమిరాజ్ కుమార్, వంగా వెంకట్ రమణమూర్తి వైవిరావు, జి వీరస్వామి, రత్నకుమారి, సందెబోయిన శ్రీనివాసరావు, ప్రశాంత్, జలీల్ పాషా, కందుల భాస్కర్, కంచర్ల జమలయ్య, చంద్రగిరి శ్రీనివాసరావు కొమారి హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :