తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నది ఉధృతి పెరుగుతున్నందున లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ సూచించారు.ఈ రోజు భద్రాచలం కరకట్ట వద్ద గోదావరి నది ఉధృతిని పరిశీలించి అక్కడ ఉన్న అధికారులకు ఎస్పీ పలు సూచనలు చేశారు. విపత్కర సమయాలలో ప్రజలకు అండగా ఉండేందుకు పోలీస్ శాఖ ఎల్లప్పుడు సిద్ధంగా ఉందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు డయల్ 100 నకు ఫోన్ చేసి పోలీసు వారి సేవలు వినియోగించుకోవాలని సూచించారు. వరదల నేపథ్యంలో పోలీసు శాఖ తరఫున ఐదు డిడిఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు
Admin
తెలుగు వెలుగు టీవీ