Thursday, 17 September 2026 08:44:16 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు స్వీకరించాలి : బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్

Date : 27 December 2024 05:57 PM Views : 854

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఇందిరమ్మ ఇండ్ల పథకానికి దరఖాస్తులు స్వీకరించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు ప్రజలకు అందేలా లేవని ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు నిజమైన లబ్ధిదారులకు అందని ద్రాక్షల ఉందన్నారు.ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని ప్రకటించి సంవత్సరం గడిచాక ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల సర్వే అంటూ హడావుడి చేస్తున్నారు తప్ప నిజమైన లబ్ధిదారులకు పంపిణీ చేయాలనే ఆలోచన ప్రభుత్వం చేయడం లేదని విమర్శించారు.గతంలో ప్రజాపాలనలో దరఖాస్తు కాలంలో చాలా మంది ఇందిరమ్మ ఇండ్ల కోసం టిక్ మార్క్ చేసుకోకపోవడంతో ఇప్పుడు సర్వే సిబ్బంది ఇంటింటి సర్వేకు వచ్చినప్పుడు వారి పేర్లు లేకపోవడంతో లబ్దిదారులు మున్సిపల్,రెవిన్యూ,కలెక్టర్ కార్యాలయల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్దిదారుల ఎంపికలో అవినీతి,అక్రమాలకు చోటు లేకుండా ఉండాలంటే రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ప్రజల సమక్షంలో లాటరీ పద్ధతిలో ఎంపిక చేయాలని కోరారు.ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజాపాలన దరఖాస్తులో ఇందిరమ్మ ఇండ్ల కోసం టిక్ మార్క్ చేయని వారి కోసం కనీసం వారం రోజులు గడువు విధించైనా దరఖాస్తులు స్వీకరించాలని డిమాండ్ చేశారు ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జున రావు,జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోత్ వీరు నాయక్,పోలే కనకరాజు,వినయ్,మురళి తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :