తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ముక్కోటి మహోత్సవాలు సజావుగా ప్రశాంతంగా జరిగేందుకు అధికారులకు అప్పగించిన విధులను అంకితభావంతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ భద్రాచలం ఆర్డీవో కార్యాలయం లో ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు నిర్వహణ పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్దేశించిన పనులను ఎలాంటి లోటుపాట్లు లేకుండా సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, ఐటీడీఏ పీవో రాహుల్, అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, ఈవో రమాదేవి, ఆర్డిఓ దామోదర్ రావు, మరియు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ